ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఈ రోజు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. శుక్రవారం ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యుల్ ని నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పు పై, రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందించింది. సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పు సుప్రీం కోర్టు నిబంధనలకు విరుద్ధం అని, సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పు పై, హైకోర్టు డివిజిన్ బెంచ్ లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అప్పీలుకు వెళ్ళింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో సంక్రాంతి సెలవలు ఉండటంతో, ఈ పిటీషన్ ని అత్యవసర పిటీషన్ గా భావించి, వెంటనే విచారణ చేయాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం తరుపున న్యాయవాది డివిజన్‌ బెంచ్‌ను కోరారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వేసిన పిటీషన్, రేపు డివిజన్ బెంచ్ ముందు విచారణకు వచ్చే అవకాసం ఉంది. రేపు డివిజన్ బెంచ్ అత్యవసర విచారణకు తీసుకుంటుందా లేదా అనేది కూడా చూడాలి. అయితే ఈ రోజు హైకోర్టు, ఎన్నికల్ షెడ్యుల్ ని కొట్టేయటం పై, వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. నాయకులు వరుస ప్రెస్ మీట్ లు పెట్టి, హైకోర్ట్ తీర్పుని స్వాగతిస్తుంటే, వైసీపీ సోషల్ మీడియా, హైకోర్టు తీర్పుని మా విజయం అంటూ చెప్పుకొస్తుంది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, వైసీపీ నేతలకు సడన్ గా హైకోర్టు అంటే ప్రేమ పుట్టుకు రావటం.

hcc 11012021 2

ఇక ఎన్నికల కమిషన్ షెడ్యుల్ విడుదల చేసిన దగ్గర నుంచి, అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. శుక్రవారం చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులు వెళ్లి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను కలవటం, వాళ్ళు ఎన్నికలకు సహకరించలేం అని చెప్పటం, రాత్రికి ఎన్నికల కమిషన్ షెడ్యుల్ విడుదల చేయటం, ఆదేశాలు ఇవ్వటం, ఎన్నికల నియమావళి, అలాగే ఈ రోజు ఒక ఆఫీసర్ ని సస్పెండ్ చేయటం, మధ్యలో ఉద్యోగ సంఘాలు, పోలీస్ సంఘాలతో తిట్టించటం, ఇలాంటివి అన్నీ చేసిన తరువాత, ఈ రోజు హైకోర్టులో పిటీషన్ పై విచారణ జరపటం, ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యుల్ కొట్టేయటం, వెంట వెంటనే జరిగిపోయాయి. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పు పై,పలువురు స్పందిస్తూ, ఈ తీర్పు పై కోర్టులో నిలవకపోవచ్చని అభిప్రాయ పడుతున్నారు. దీనికి అనేక ఉదాహరణలు చెప్తూ, సహజంగా కోర్టులు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవని, గతంలో వెస్ట్ బెంగాల్ లో, స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళగా, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని, రెండునెలల క్రితం కేరళలో కూడా ఇలాగే సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విషయం గుర్తు చేస్తున్నారు. చూద్దాం ముందు ముందు, ఇది ఎన్ని మలుపులు తిరుగుతుందో.

Advertisements

Advertisements

Latest Articles

Most Read