గన్నవరంలో పొలిటికల్ టెన్షన్ నెలకొంది. అనూహ్యంగా ఇది ఒకే పార్టీలో జరుగుతున్న తంతు కావటం విశేషం. గన్నవరం ఎమ్మెల్యే వంశీ, తెలుగుదేశం పార్టీలో గెలిచి, కేసులు భయంతో, వైసీపీలోకి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి అక్కడ అప్పటికే ఉన్న దుట్టా రామచంద్రరావు వర్గం, అలాగే యార్లగడ్డ వర్గం, వంశీ రాకను వ్యతిరేకిస్తూ, వంశీకి సహకరించకుండా వస్తున్నారు. ఈ మధ్య ఏమైందో, ఏమి భరోసా వచ్చిందో కానీ, వంశీ హడావిడి చేస్తున్నాడు. సొంత పార్టీ నేతల పైనే విమర్శలు చేస్తున్నాడు. అటు నుంచి దుట్టా, యార్లగడ్డ వర్గం కూడా తగ్గేది లేదని రెచ్చిపోతున్నారు. అధిష్టానం పిలిచి ఇరు వర్గాలకీ రాజీ కుదిర్చే ప్రయత్నం చేసినా, అది వర్క్ ఔట్ అవ్వలేదు. వ్యవహారం ముదిరి వార్నింగ్ లు ఇచ్చుకునే వరుకు వెళ్ళింది. పొలిటకల్ హీట్ వేడెక్కటంతో, వంశీకి భద్రత పెంచారు. గడప గడపకు కార్యక్రమంలో తిరిగే సమయంలో, వంశీకి 25 మంది పోలీసులతో ప్రత్యేక పహారా ఏర్పాటు చేసారు. అయితే ఎక్కడైనా ప్రత్యర్ధి పార్టీలు గొడవ పడితే ఇలాంటి సందర్భం ఉంటుంది, ఇక్కడ వెరైటీగా, వాళ్ళు వాళ్ళు కొట్టుకుని, ఇక్కడ వరకు వచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read