ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ పై రెండు సార్లు వ్యాట్ పెంచిన వైసీపీ ప్రభుత్వం, తాజాగా మరో రూపంలో బాదుతూ షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఉన్న వ్యాట్, టాక్సులకి అదనంగా, రాష్ట్ర ప్రభుత్వం తరుపున, ప్రతి లీటర్ పెట్రోల్, అలాగే హైస్పీడ్ డీజిల్‌ మీద, ప్రతి లీటర్ కు రూపాయి పెంచుతూ, ఆదేశాలు ఇచ్చింది. ఇది సెస్ అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ప్రతి డీలర్ నుంచి, ఈ మొత్తం వసూలు చేస్తారు. అయితే ఈ వసూలు చేసే సెస్ ని, రాష్ట్రంలో రోడ్డుల అభివృద్ధి కోసం ఉపయోగిస్తారని ప్రభుత్వం చెప్తుంది. ఈ పెంచిన సెస్ ద్వారా, రాష్ట్ర ప్రభుత్వానికి 600 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. అంటే, ఈ 600 కోట్లు ప్రజల పై భారం అనమాట. అధికారంలోకి రాగానే, ప్రమాణ స్వీకర వేదిక పై నుంచి, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, ఇప్పటికి రెండు సార్లు వ్యాట్ పెంచారు. దాని వాళ్ళ 2 రూపాయల వరకు లీటర్ కు అదనపు భారం పడుతుంది.

ఒక వేళ కేంద్రం రేట్లు తగ్గించినా, ప్రభుత్వం పెంచిన వ్యాట్ మాత్రం అలాగే ఉంటుంది. ఇక ఇప్పుడు దీనికి తోడు లీటర్ కు ఈ రూపాయి సెస్ అదనం. అంటే జగన్ మొహన్ రెడ్డి వచ్చిన తరువాత, ఇప్పటి వరకు ప్రజల పై మూడు రూపాయల వరకు అదనపు భారం పడుతుంది. రోజుకి రెండు లీటర్లు వాడే వారు ఉన్నా, నెలకు 180 రూపాయల వరకు అదనపు భారం, ఏడాదికి, రెండున్నర వేలు అధిక భారం. ఇక ఈ పెంపు భారం మనం వాడే వాహనాల పైనే కాదు, బస్సు చార్జీలు, అటో చార్జీలు పై పడుతుంది. రవాణా చార్జీలు అంటూ, మనం వాడే ప్రతి నిత్యవసర వస్తువు పైనా, భారం పడుతుంది. ఇలా అనేక నష్టాలు ఉంటాయి. అయితే ఇప్పుడు పెంచిన సెస్ రహదారుల అభివృద్ధి అంటున్నారని కానీ, ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్ లో, కేంద్రం కూడా రహదారులు కోసం పెద్ద ఎత్తున డబ్బులు కేటాయిస్తుంది. మరి ప్రభుత్వం, ఈ పెంచిన సెస్ తో మరిన్ని రహదారులు అభివృద్ధి చేస్తుందా ? చూద్దాం

Advertisements

Advertisements

Latest Articles

Most Read