షార్‌పై ఉగ్రవాదులు గురి పెట్టారని కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. బంగ్లాదేశ్ ఉగ్రవాదుల దాడులకు సిద్ధమవుతున్నారని నిఘా వర్గాల సమాచారం. షార్‌పై దాడులకు బంగ్లాదేశ్‌ ఉగ్రవాదుల వ్యూహ రచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐబీ ఐజీ అమితాబ్‌ రంజన్‌ హుటాహుటిన షార్‌ను సందర్శించారు. షార్‌ పరిసరాల్లో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు. కేంద్ర ఇంటెలిజెన్స్‌ అడిషనల్‌ డీజీ అమితాబ్‌ రంజన్‌ ఆధ్వర్యాన ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిందీ సమావేశం. శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం అత్యంత సున్నితమైన ప్రాంతమని, దీనికి భద్రత పరంగా మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని అధికారులు నిర్ణయించారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు అవకాశం ఉందని.. దీనిని దృష్టిలో ఉంచుకుని భద్రతను అప్రమత్తం చేయాల్సి ఉందని అవగాహనకు వచ్చినట్లు సమాచారం. సమావేశంలో కేంద్ర ఇంటెలిజెన్స్‌ అధికారులతోపాటు, జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, షార్‌ సంచాలకులు పాండ్యన్‌, నియంత్రణాధికారి జేవీ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

nellore 12062019 1

శ్రీలంకలో నెలరోజుల క్రితం జరిగిన ఆత్మాహుతి దాడులు మరువక ముందే, కొద్ది రోజుల క్రితం నెల్లూరు తీరప్రాంతానికి శ్రీలంక బోటు కొట్టుకువచ్చిన ఘటన కలకలం రేపుతోంది. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పొన్నపూడి పాతూరు గ్రామంలోని సముద్రంలో ఈ పడవ మే18న కొట్టుకువచ్చింది.శ్రీలంక నుంచి ఈ బోటు కొట్టుకు రావడం పలు అనుమానాలు తావిస్తోంది. ఇందులో ఉగ్రవాదులు ఏమైనా వచ్చారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. శ్రీలంక నుంచి నెల్లూరు వరకు రావాలంటే తమిళనాడు దాటుకుని రావాలని అలాంటప్పుడు తమిళనాడు తీరప్రాంతంలో భద్రతా సిబ్బంది ఎందుకు గుర్తించలేకపోయారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు తీరంలో ఈ బోటును మత్స్యకారులు గుర్తించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఖాళీగా ఉన్న బోటును వారే ఒడ్డుకు చేర్చారు. బోటుపై రాసి ఉన్న అక్షరాల ఆధారంగా ఇది శ్రీలంకకు చెందిన బోటు అని తేల్చేశారు అధికారులు. అయితే ఇందులో ఉగ్రవాదులు వచ్చారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నెల్లూరు తీరప్రాంతం, అటవీ ప్రాంతంలో ఆక్టోపస్ దళాలు జల్లెడ పడుతున్నాయి. ఇక మెరైన్ పోలీసులు కూడా గస్తీని ముమ్మరం చేశారు. ఇప్పటికే షార్, కృష్ణపట్నం పోర్టు ఇతర తీరప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు పోలీసులు.

Advertisements

Add comment


Security code
Refresh

Advertisements

Latest Articles

Most Read