ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని వింత పరిస్థితి మన రాష్ట్రంలో చోటు చేసుకుంది. ప్రభుత్వం మొండి వైఖరితో, రాజ్యాంగ సంక్షోభం దిశగా రాష్ట్రం వెళ్తుందా అని పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారు ? గవర్నర్ తీసుకునే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి, నచ్చక పొతే, ఏమి చేస్తుంది, ఒక వేళా గవర్నర్ మాట కూడా ప్రభుత్వం వినక పోతే, కేంద్ర ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది, వంటి ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. వీటి అన్నిటికీ కారణం, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మెన్, ఆంధ్రప్రదేశ్ గోవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీ అవ్వటం. శాసనమండలిలో నెల రోజుల క్రితం, పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే చట్టం రద్దు బిల్లులు రావటం, అక్కడ ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం మాత్రం, సెలెక్ట్ కమిటీకి ఈ బిల్లులు వెళ్ళటానికి వీలు లేదు అంటూ ఎదురు దాడి చేస్తుంది. అసలు సెలెక్ట్ కమిటీకి బిల్లులు వెళ్తే, ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు.

గట్టిగా మూడు నెలల్లో సెలెక్ట్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది, అప్పుడు ఎలాగూ ప్రభుత్వం బిల్లులు ఆమోదించుకోవచ్చు. అయితే, ప్రభుత్వం మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు. దీని కోసం ఏకంగా మండలినే రద్దు చేసి పడేసింది. అయితే, ఇక్కడ కేంద్రంలో ఈ బిల్ పాస్ అయితే కాని, మండలి రద్దు అయినట్టు కాదు. ఈ నేపధ్యంలో, ఇప్పటికే ఆ రెండు బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్ళటంతో, సెలెక్ట్ కమిటీ వెయ్యమని, మండలి కార్యదర్శికి, చైర్మెన్ ఆదేశాలు ఇవ్వటం, కార్యదర్శి, రెండు సార్లు ఆ ఫైల్ ని వెనక్కు పంపటం తెలిసిందే. దీంతో, ఎప్పుడూ లేని విధంగా, ఒక సభ చైర్మెన్ ఆదేశాలను, ధిక్కరించారు, మండలి సెక్రటరీ. దీని వెనుక ప్రభుత్వం ఒత్తిడి ఉందని, ప్రతిపక్షాలు అంటున్నాయి. ఈ పరిణామాల నేపధ్యంలోనే, మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ ఈ రోజు, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీ అయ్యారు.

తన ఆదేశాలు పాటించకుండా, సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటుపై బులెటెన్‌ విడుదల చేయకుండా, మండలి కార్యదర్శి చేస్తున్న వ్యవహారం పై గవర్నర్ కు ఫిర్యాదు చేసారు. ఇదే విషయం పై గవర్నర్ ను కలిసిన తరువాత, షరీఫ్ మీడియాతో మాట్లాడారు. సెలెక్ట్ కమిటీ విషయంలో సెక్రటరీ పై ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. విశిష్ఠ అధికారంతో తాను తీసుకున్న నిర్ణయాన్ని, ఒక కార్యదర్శి వ్యతిరేకించటం, ఇది వరకు, ఎక్కడా, ఎప్పుడు జరగలేదని అన్నారు. ఈ విషయంలో గవర్నర్ చొరవ తీసుకుని, సెక్రటరీకి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. అయితే ఇప్పుడు గవర్నర్ ఎలా వ్యవహరిస్తారు అనే దాని పై, అందరి దృష్టి ఉంది. ఒక వేళ, గవర్నర్ ఆదేశాలు కూడా ప్రభుత్వం పాటించక పొతే, తరువాత ఏమి జరుగుతుంది ? రాష్ట్రంలో రాజ్యంగ సంక్షోభం వస్తుందా ? అంత దూరం మొండిగా ప్రభుత్వం వెళ్తుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read