ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పాదయాత్రలు చేసి, చంద్రబాబుని తిట్టి, హడావిడి చేసిన షర్మిల, సడన్ గా అన్నతో అలిగి, తెలంగాణా వెళ్ళిపోయారు. ఉన్నట్టు ఉండి, నేను తెలంగాణా కోడలని, వైఎస్ఆర్ బిడ్డని, జగన్ తో గొడవలు ఉన్నాయనే వాతావరణం కల్పించి, కొత్త పార్టీ పెట్టేసారు. ఇప్పటికే పాదయాత్ర కూడా చేస్తున్నారు. అయితే తెలంగాణాలో ఫైట్ మొత్తం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీగా నడుస్తుంటే, షర్మిల పార్టీ పుట్టుక రావటం వెనుక అనేక వాదనలు వస్తున్నాయి. ఇది పక్కన పెడితే, కొద్ది రోజుల క్రితం, ఒక రెడ్ ఫైల్ పట్టుకుని, షర్మిల గవర్నర్ ని కలిసారు. అందులో కేసీఆర్ అవినీతి భాగోతం ఉంది అంటూ, ఒక ప్రముఖ కాంట్రాక్టర్ పై విమర్శలు చేసారు. ఇప్పుడు అదే ఫైల్ పట్టుకుని, షర్మిల ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలుస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. మరో వారం పది రోజుల్లో కేసీఆర్ పై ఫిర్యాదు ఇవ్వటానికి, షర్మిల ఢిల్లీ వెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయం పై మరో ప్రచారం కూడా జరుగుతుంది. ఇదంతా బీజేపీ వేసిన స్కెచ్ అని, షర్మిలతో ఫిర్యాదు చేపించి, సిబిఐ ఎంక్వయిరీ వేసి, కేసీఆర్ ని ఫిక్స్ చేసే వ్యూహం ఇందులో ఉందని ప్రచారం జరుగుతుంది. ఇది ఎంత వరుకు నిజమో కానీ, షర్మిల అయితే, ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేయటం మాత్రం నిజం. అక్కడ నుంచి పరిణామాలు ఎలా మారతాయో, ఈ పరిణామం తరువాత, కేసీఆర్-జగన్ మధ్య ఉన్న స్నేహం ఎటు దారి తీస్తుందో చూడాలి మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read