ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, 2019 ఎన్నికల తరువాత, అనూహ్య రాజకీయ మార్పులు జరిగిన విషయం తెలిసిందే.. 2019 ఎన్నికల ముందు వరకు, కమ్యూనిస్ట్ పార్టీలతో ఉన్న పవన్ కళ్యాణ్, దానికి పూర్తి వ్యతిరేకంగా, సిద్దాంతాలకు పూర్తి విరుద్ధంగా ఉన్న బీజేపీతో కలిసి కొత్త రాజకీయ ప్రయాణం మొదలు పెట్టారు. నిజానికి ఎన్నికల ముందు నుంచి పవన్ బీజేపీకి దగ్గర అనే ప్రచారం ఉన్నా, పవన్ కళ్యాణ్ బీజేపీ పై చేసిన విమర్శలు, ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి, బీజేపీని దోషిగా చూపించిన తీరుతో, ఆ విమర్శలు నుంచి బయట పడ్డారు. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన విధానం కావచ్చు, మరేదైనా కారణం అవ్వచ్చు కానీ పవన్, బీజేపీతో కలిసారు. రెండు పార్టీలు పొత్తుగా ఏర్పడి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాణం మొదలు పెట్టాయి. నిజానికి ఈ కలయికలో పవన్ కళ్యాణ్ పార్టీనే పెద్ద పార్టీ. ఎందుకంటే పవన్ పార్టీకి 6 శాతం ఓట్లు వస్తే, బీజేపీకి ఒక్క శాతం వరకు వచ్చాయి. అయితే కేంద్రంలో బీజేపీ బలంగా ఉంది కాబట్టి, పవన్ తప్పని పరిస్థితిలో, బీజేపీ అజెండా మోయాల్సిన పరిస్థితిలో ఉన్నారు. అయితే క-రో-నా కారణం కావచ్చు, మరేదైనా కారణం కావచ్చు కానీ, జనసేన, బీజేపీ ఇప్పటి వరకు కలిసి, క్షేత్ర స్థాయిలో పెద్దగా పని చేసింది లేదు. సోషల్ మీడియాలో మాత్రం, ఒకరికిఒకరు సమర్ధిస్తూ పోస్ట్లు పెడుతున్నా, కింద స్థాయిలో ఇంకా అంత సఖ్యతతో కార్యక్రమాలు మొదలు కాలేదనే చెప్పాలి. అయితే ఇక్కడ ఒక విషయంలో మాత్రం, పవన్ కళ్యాణ్ వైఖరిని మెచ్చుకోవాలి. అమరావతి విషయంలో పవన్ కళ్యాణ్ మొదటి నుంచి మద్దతు తెలుపుతున్నారు. అమరావతిలో పోలీస్ ఆంక్షలు ఉన్నా, అక్కడకు వచ్చి పర్యటన చేసారు. ఆ తరువాత అమరావతి ఉద్యమం పవనే నడుపుతారని అందరూ భావించినా, ఆ తరువాతే బీజేపీతో కలవటంతో, పవన్ కొంచెం స్లో అయ్యారు.

ఆ తరువాత బీజేపీ ఢిల్లీలో ఒక మాట, రాష్ట్రంలో ఒక మాట మాట్లాడుతుంది. గతంలో అధ్యక్షుడిగా ఉన్న కన్నా అమరావతికి పూర్తి మద్దతు తెలుపుతా, ఇప్పటి అధ్యక్షుడు సోము వీర్రాజు మద్దతు అని చెప్తున్నా, ప్రజలు ఎందుకో విశ్వసించటం లేదు. అయితే బీజేపీ వైఖరి ఎలా ఉన్నా, పవన్ మాత్రం, ప్రతి సందర్భంలో అమరావతి తరుపున మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు పోలవరం విషయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయంతో, అందరూ షాక్ అయ్యారు. పోలవరం అంచనాలు కేంద్రం తగ్గించింది. అయితే ఈ పరిణామం పై పవన్ స్పందించలేదు. స్పందించక పొతే, పవన్ ఇమేజ్ కు ఇబ్బంది. టిడిపి, వైసీపీ కంటే, పోలవరం విషయంలో బీజేపీదే బాధ్యత ఎక్కువ. మరి ఈ విషయంలో బీజేపీ పై, పవన్ స్పందన ఎలా ఉంటుంది ? నిజానికి ఇక్కడ బీజేపీకి కొత్తగా పోయేది ఏమి ఉండదు. బీజేపీని ఏపి ప్రజలు ఇప్పట్లో విశ్వసించరు అనే చెప్పాలి. అయితే వారితో ఉన్న పవన్ కు మాత్రం, ఈ పరిణామం ఇబ్బందిగానే మారుతుంది. 6 శాతం ఓటు బ్యాంకు ఉన్న పవన్, దాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారు. ఇప్పటికే ప్రత్యెక హోదా, అమరావతి పై బీజేపీ వైఖరి పై అభ్యంతరాలు ఉన్న సమయంలో, దానికి పోలవరం వచ్చి చేరింది. మరి ఈ అంశాల పై బీజేపీ పై ఉన్న నెగటివ్ ని, వారితో కలిసి ఉన్న పవన్ ఎలా అధిగమిస్తారు ? మౌనంగా భారిస్తారా ? స్నేహపూర్వకంగా ఉంటూనే అభ్యంతరం తెలుపుతారా ? లేక మిగతా రాజకీయ పార్టీలు లాగే, ఎదుటు వారి పై తప్పు తోసేసి, తప్పించుకుంటారా ? కాలమే సమాధానం చెప్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read