"And today's prize for most ridiculous excuse-making goes to..... the government of Andhra Pradesh. Hard to fathom how much damage the decision unilaterally to scrap this new city project will have for India's reputation as a reliable international partner." ఈ మాటలు చెప్పెంది, సింగపూర్ దేశానికి చెందిన ఒక ప్రముఖ ప్రొఫెసర్. ఆయన పేరు "జేమ్స్ క్రాబ్ ట్రీ". సింగపూర్ ప్రభుత్వం, అమరావతి ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నాం అంటూ ఇచ్చిన ప్రకటన పై, ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవి. "ఇలాంటి వింత వింత కారణాలు చెప్తూ, తప్పించుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బహుమతి ఇవ్వాలి. మంచి ఇంటర్నేషనల్ పార్టనర్ గా, భారత దేశానికి పేరు ఉందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో, భారత దేశ ప్రతిష్టకే ఇబ్బందికర వాతావరణం ఉండే పరిస్థితి ఉంది అంటూ, ఈయన చేసిన ట్వీట్ తో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై, సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

singapoire 13112019 2

ఆరు నెలల్లో, దేశం మొత్తం, మన రాష్ట్రం వైపు చూసేలా చేస్తాం అని అంటే, ఏంటో అనుకున్నాం అని, ఇప్పుడు భారత దేశమే కాదు, ప్రపంచ దేశాలే మన వైపు చూసేలా, జగన్ చేసారని, కాకపొతే, అది మంచి అయితే పరవాలేదు, చెడుగా మన రాష్ట్రాన్ని చూస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. గతంలో పీపీఏల విషయంలో జపాన్ ప్రభుత్వం, ఏకంగా ఆంధ్రప్రదేశ్ పై ప్రధాని మోడీకే ఉత్తరం రాసింది. ఏపిలో జరుగుతున్నవి చూస్తుంటే, మా పెట్టుబడి దారులు పెట్టుబడులు పెట్టాలి అంటేనే భయపడుతున్నారు, ఇది ఒక రాష్ట్రంతో ఆగదు, మీ దేశం మొత్తానికి ఇబ్బంది అంటూ, అప్పట్లో జపాన్ ఉత్తరం రాసింది. ఇప్పుడు, సింగపూర్ ప్రభుత్వం, కూడా ఇంచుమించు ఇలాగే స్పందించింది. గతంలో చంద్రబాబు హయంలో, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ వాతావరణం ఉంటే, ఇప్పుడు అది రివర్స్ అయ్యింది.

singapoire 13112019 3

సింగపూర్ లో ఉన్న జాతీయ పత్రికలు కూడా, సింగపూర్ ప్రభుత్వం, ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో, చెప్తూ కధనాలు రాసారు. నిన్న సింగపూర్ ప్రభుత్వం ఆఫిషియల్ ప్రెస్ నోట్ గురించి చెప్తూ, ఈ కధనాల్లో, అసలు ఎందుకు సింగపూర్ ప్రభుత్వం తప్పుకుంది అని చెప్తూ రాసిన విశ్లేషణల్లో, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, అమరావతి పై ఆసక్తి లేదని రాసాయి. దీనికి ఉదాహరణగా, అమరావతికి లోన్ ఇవ్వకుండా, ప్రపంచ బ్యాంకు వెనక్కు వెళ్ళిపోవటం, అలాగే ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా వెనక్కు వెళ్ళిపోవటం పై, ప్రస్తావించాయి. అలాగే అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితి కూడా కారణం అని చెప్తూ, చంద్రబాబు నాయుడు లెగసి లేకుండా చెయ్యాలని ప్రస్తుత ప్రభుత్వం చూస్తుందని రాసాయి. అలాగే, సింగపూర్ దేశానికి ఉన్న డైరెక్ట్ ఫ్లైట్ కూడా, ఈ కొత్త ప్రభుత్వం రద్దు చేసింది అంటూ, అన్ని వివరాలతో, కధనాలు రాసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read