చంద్రబాబు అమరావతి పర్యటనలో, ఆయన పై ఒక పధకం ప్రకారం రాళ్ళు వేసిన కొట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సు అద్దం కూడా పగిలింది. అయితే చంద్రబాబు లాంటి జెడ్ ప్లస్ క్యాటగరీ బద్రత ఉన్న నేతలకు కూడా, ఇలా జరిగింది అంటూ, అదే బద్రతా వైఫల్యం అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. అసలు అక్కడికి ఆందోళన కారులను, ఎలా వదిలారని, పోలీసులు కావాలనే ఇలా చేసారు అంటూ, టిడిపి అంటుంది. అదీ కాకా, జరిగిన సంఘటన పై, డీజీపీ గౌతం సవంగ్ చేసిన ప్రకటన కూడా వివాదాన్ని పెంచింది. ఎవరికైనా నిరసన తెలియ చేసే హక్కు, భావ ప్రకటనా స్వేఛ్చ గురించి మాట్లాడే హక్కు ఉంటుందని, అసలు ఏమి జరుగుతుందో చూద్దామని, ఆందోళనకారులను వదిలమని డీజీపీ అన్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసామని, వారు చంద్రబాబు మాటలకు విసుగెత్తిపోయి ఉన్నామని చెప్పారు అంటూ, గౌతం సవాంగ్ చెప్పారు. అయితే ఒక రాజకీయ నాయకుడులా డీజీపీ మాట్లాడుతున్నారు అంటూ టిడిపి ఆరోపిస్తుంది.

amaravati 01122019 2

చంద్రబాబు తన ప్రెస్ మీట్ లో, పోలీస్ లాఠీని కూడా చూపిస్తూ, ఇది కూడా మా మీద వేసారని, ఇది పోలీసులు వేసారా, లేక అక్కడ ఉన్న రౌడీ మూకకు ఇచ్చారా అని ప్రశ్నించారు. అయితే డీజీపీ మాట్లాడిన మాటలు, పోలీసులు తీరు పై, తెలుగుదేశం పార్టీ, కేంద్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. రాష్ట్రంలో అధికార వైసీపీ పార్టీ ఆదేశాలతో, పోలీస్‌ శాఖ తెలుగుదేశం పార్టీ చేసే కార్యక్రమాలని భగ్నం చెయ్యటమే పనిగా పెట్టుకుందని, టీడీపీ కార్యక్రమాలకు ఆటంకం కలిగించడం, జెడ్ ప్లస్ బద్రతలో ఉన్న చంద్రబాబు పై అమరావతిలో జరిగిన రాళ్ళ దాడి, తదితర అంశాలను వివరిస్తూ శనివారం హోం శాఖ ముఖ్య కార్యదర్శికి నిన్న టిడిపి లేఖ రాసింది. వరుస సంఘటనలను తన లేఖలో ప్రస్తావించారు.

amaravati 01122019 3

అయితే తెలుగుదేశం నేతలు ఈ విషయన్ని పార్లమెంట్ లో ప్రస్తావించి, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా ద్రుష్టికి కూడా తీసుకు వెళ్ళాలని, నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ఇప్పటి వరకు జరిగిన దాడిని లైట్ తీసుకున్న ఏపి ప్రభుత్వం, అమరావతి పర్యటనలో జరిగిన పరిణామాల పై, సిట్ ఏర్పాటు చేసింది. డీజీపీ ఆదేశాల మేరకు గుంటూరు రూరల్ అడిషనల్ ఎస్పీ నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. పోలీసులు అలసత్వం వహించటం పైనా, ఈ సిట్ విచారణ చేయ్యనుంది. తుళ్లూరు పోలీసు స్టేషన్‌లో పెట్టిన అన్ని కేసులనూ సిట్‌కి బదిలీ చేశారు. ఏడు రోజుల్లో ప్రభుత్వానికి సిట్ టీం నివేదిక ఇవ్వనున్నది. మరి తూతూ మంత్రంగా చర్యలు ఉంటాయో, లేక నిజంగానే, ఆ రోజు జరిగిన తీరు పై విచారణ చేస్తారో లేదో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read