గుంటూరులో ఉన్న సంగం డెయిరీ అంటే అందరికీ ఎంతో నమ్మకం. అటు వినియోగదారులు, పాల ఉత్పత్తి దారులు, రైతులు, ఉద్యోగులు ఇలా అందరికీ ఈ సంస్థ అంటే నమ్మకం, గౌరవం. అలాగే ఈ సంస్థ అనేక సామాజిక కార్యక్రమాలు కూడా చేపడుతూ, పేదలకు కూడా అండగా ఉంటూ వచ్చింది. గతంలో సంగం డెయిరీ ఛైర్మన్ గా ఉన్న ధూళిపాళ్ల వీరయ్య చౌదరి తరువాత, ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కూడా సంస్థ ఉన్నతికి పాటుబడ్డారు. అయితే రాష్ట్రంలోని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, టిడిపి నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ని రాజకీయంగా టార్గెట్ చేయటం కోసం, సంగం డెయిరిని టార్గెట్ చేసింది. ఇందులో అనేక కేసులు, అనేక పోరాటాలు, న్యాయ పోరాటాలతో, చివరకు సంగం డెయిరి నీతిగా బయట పడింది. రాష్ట్ర ప్రభుత్వానికి యధావిధిగా అన్ని విషయాల్లో తగిలినట్టే, ఈ విషయంలో కూడా ఎదురు దెబ్బ తగిలింది. సంగం డెయిరిని అవినీతి సంస్థ అని బ్రాండ్ వేయటం కోసం, వైసీపీ ప్రభుత్వంతో పాటుగా, తమ అనుకూల మీడియా, అనుకూల సోషల్ మీడియా, ఇలా అందరూ తమ శక్తికి మించి కష్టపడ్డారు. అయితే చివరకు, వారి ప్రయత్నాలు ఏమి ఫలించలేదు. పైసా నష్టం కూడా సంగం డెయిరికి జరగలేదు. ఇప్పుడు ఆ సంస్థ ప్రశంసలు కూడా అందుకుంటుంది.

sangam 26102021 2

ఏ సంస్థని అయితే ఏపి ప్రభుత్వం అవినీతి సంస్థ అని చెప్పిందో, అదే సంస్థకి నమ్మకమైన సంస్థ అనే అవార్డ్ వచ్చింది. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్ గ్రూప్ నిర్వహించిన "టైమ్స్ బిజినెస్ అవార్డ్స్ ఆంధ్రప్రదేశ్ 2021" అవార్డుల సందర్భంగా, "సంగం డెయిరి" ప్రతిస్టాత్మకమైన "Most Trusted Dairy (నమ్మకమైన సంస్థ)" అవార్డు లభించింది. ఈ అవార్డ్ కూడా ప్రధానం చేసింది పోలీసులే. విజయవాడ నగర డిసిపి ప్రశాంతి, ఈ అవార్డ్ ను, సంగం డెయిరి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ గోపాల కృష్ణన్ కు అందచేసారు. వినియోగదారుల ఆదరణ, పాడి రైతుల సమిష్టి కృషితోనే ఈ అవార్డ్ సాధించామని, ఇన్నాళ్ళు తమ వెంట నడిచిన పాడి రైతులకు ఈ అవార్డుని అంకితం చేస్తున్నట్టు సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర చెప్పారు. తమ గమ్యాన్ని చేరుకోవటానికి ఎలాంటి అడ్డంకులు ఎదురు అయినా, అన్నీ దాటుకుని, రైతులు, వినియోగదారుల సహకారంతో, అనుకున్న గమ్యాన్ని చేరుకుంటాం అని అన్నారు. అవార్డు వచ్చిన సందర్భంగా, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read