మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నారు. ఈరోజు సాయంత్రమే అసెంబ్లీ కార్యదర్శికి సోమిరెడ్డి రాజీనామా పత్రం అందించనున్నారు. కాగా సోమిరెడ్డి వచ్చే ఎన్నికలలో నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుండి పోటీచేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. గత ఎన్నికలలో సర్వేపల్లి నుండే పోటీచేసి వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డ్డి మీద ఐదువేల మెజార్టీతో ఓడిపోయారు. అయినా చంద్రబాబు సోమిరెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మంత్రిగా ఐదేళ్లు నియోజకవర్గంలో పట్టు సాధించడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆయనకంటూ గుర్తింపు తెచ్చుకోవడంతో ఈసారి గెలుపు తధ్యం అని పేర్కొన్నారు.

somireddy 15022019 2

సార్వత్రిక ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో పలువురు టీడీపీ, వైకాపా నేతలు తమతమ మాతృపార్టీలకు రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నేతలు అవంతి శ్రీనివాస్, ఆమంచి కృష్ణమోహన్‌లు రాజీనామా చేయగా, వైకాపా నుంచి వంటేరు వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిలు శుక్రవారం రాజీనామాలు చేశారు. వీరిద్దరూ తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో టీడీపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది. అయితే ఈ సారి నెల్లూరు జిల్లాలో ఎలాగైనా మెరుగైన ఫలితాలు సాధించాలని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు... ఇందుకోసం బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని భావిస్తున్నారు.

somireddy 15022019 3

ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికే అభ్యర్థులందరిని పేర్లను ఖరారు చేయాలని నిర్ణయించుకున్న టీడీపీ అధినేత... తాజాగా అన్నీ సెట్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీమంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఈ సారి నెల్లూరు రూరల్ స్థానం నుంచి బరిలోకి దింపాలని చంద్రబాబు నిర్ణయించారని తెలుస్తోంది. ఆదాల అభ్యర్థన మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ విషయాన్ని జిల్లాకు చెందిన పార్టీ ముఖ్యనేతలకు కూడా చంద్రబాబు వివరించినట్టు సమాచారం. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మంత్రి నారాయణ... రాబోయే ఎన్నికల్లో నెల్లూరు అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ కారణంగానే కొన్నేళ్లుగా ఆయన నెల్లూరు సిటీపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. మంత్రిగా రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో పాటు నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులను కలుపుకుని ముందుకు సాగుతున్నారు. చంద్రబాబుకు సన్నిహితుల్లో నారాయణ ఒకరు కావడంతో... నెల్లూరు అర్బన్ సీటు ఈ సారి ఆయనకే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read