ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతున్న సంగతి తెలిసిందే. ఒక పక్క అప్పులు, మరో పక్క లేని పెట్టుబడులు.. ఒక పక్క కరెంటు కోతలు, మరో పక్క పవర్ హాలిడే, క్రాప్ హాలిడేలు.. ఒక పక్క దళితులుపై అమానుషాలు, మరో పక్క ఆడ బిడ్డలకు లేని భద్రత. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఏది చూసినా, ఏది పట్టుకున్నా మసి అయిపోతుంది. రాష్ట్రం నాశనం అయిపోతుంది. ఈ క్రమంలోనే, అందరూ కలిసి జగన్ పై పోరాడాల్సిన తరుణం వచ్చింది. ప్రజలు కూడా ఎవరు తమ పక్కకు వాచ్చి పోరాడతారా అని ఎదురు చూస్తున్నారు. డబ్బు , అధికారం, ఢిల్లీ అండ ఉన్న జగన్ ని ఎదుర్కోవాలి అంటే, అందరూ కలిసి పోరాడితే కానీ, జగన్ మోహన్ రెడ్డి కొమ్ములు విరచలేని పరిస్థితి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్, మూడు నెలల క్రిందట, వైసీపీ వ్యతిరేకత ఓటు చీలనివ్వను అంటూ, పరోక్షంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రాతిపాదన తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఈ పొత్తుల పై చర్చ నడుస్తుంది. రెండు రోజుల క్రితం చంద్రబాబు, పొత్తుల విషయం పై కాకుండా, ప్రజా పోరాటానికి సిద్ధం కావాలని, తాము నాయకత్వం వహిస్తాం అని, అవసరం అయితే త్యాగాలకు అయినా సిద్ధం అంటూ, స్పందించారు. అయితే చంద్రబాబు పొత్తులు విషయం పైనే, ఈ ప్రకటన చేసారు అంటూ చర్చ జరిగింది.

somu 09052022 2

ఇదే విషయం పైన , నిన్న పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, తమ వైఖరి మరోసారి స్పష్టం చేసారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలితే, మళ్ళీ రాష్ట్రానికి నష్టం అని, అందుకే ఓటు చీలకుండా చూస్తాం అని, ఇందు కోసం అన్ని పార్టీలు కలిసి రావాలని అన్నారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పై స్పందిస్తూ, ఆయన నేరుగా తమతో పొత్తు గురించి మాట్లాడిన రోజున, తమ నిర్ణయం చెప్తామని అన్నారు. అయితే మధ్యలో దూరిన సోము వీర్రాజు, తమ పొత్తులో ఉన్న పార్టీ పవన్ కళ్యాణ్ అభిప్రాయాన్ని లెక్క చేయటం లేదు. సోము వీర్రాజు మాట్లాడుతూ, తమకు ఎవరితో పొత్తు అవసరం లేదని, తామే ఒంటరిగా పోటి చేసి, అవసరం అయితే జనసేనని కలుపుకుని, ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అన్నారు. దీంతో జనసేన షాక్ తింది. అసలు ఒక్క ఎమ్మెల్యేకే దిక్కు లేకపోతే, ఎక్కడ నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని, వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చే ప్రయత్నంలో సోము వీర్రాజు ఉన్నారని, దీని పైన ఢిల్లీలోనే తేల్చుకుంటాం అని అంటున్నారు. నిన్న పవన్ కూడా సోము వీర్రాజు మాటల పై, ఒక నవ్వు నవ్వి, ఢిల్లీలో వారికి అర్ధమయ్యేలా చెప్తాం అని అన్నారు. మొత్తానికి సోము వీర్రాజు, మళ్ళీ జగన్ ని గెలిపించే ప్రయత్నంలో, శ్రమిస్తున్నారని అర్ధమవుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read