ఆమె ఒక సీనియర్ పార్లమెంటరీయన్. ఒక జాతీయ పార్టీకి అద్యక్షరాలు. ఒకప్పుడు దేశాన్ని, తన కంటి సైగతో ఏలిన నేత. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పడిపోయినా, ఆమె అంటే ఇప్పటికీ గౌరవిస్తూనే ఉంటారు. ఆమె కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. పార్లిమెంట్ లో ఎంతో మంది ఉపన్యాసాలను విన్న ఆమె, ఈ రోజు పార్లమెంట్ లో ఒక ఎంపీ ఉపన్యాసాన్ని మెచ్చుకున్నారు. బల్ల చరిచి, అభినందనలు తెలిపారు. అది కూడా, వేరే పార్టీకి చెందిన ఎంపీ ఉపన్యాసం కావటం విశేషం. ఈ రోజు పార్లమెంట్ లో, దిశ హత్యాచార ఘటన పై, చర్చ జరిగింది. ఈ సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, తెలుగుదేశం పార్టీ ఎంపీ, రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. ఆయన మాట్లాడింది, రెండు నిమిషాల లోపే అయినా, ఎంతో అర్ధవంతంగా మాట్లాడారు. రామ్మోహన్ నాయుడు అన్ని ప్రసంగాలు లాగానే, ఈ ప్రసంగం కూడా హైలైట్ గా నిలిచింది. ఆయన మాట్లాడుతూ, షాద్‌నగర్‌లో వైద్యురాలి పై జరిగిన గ్యాంగ్‌రేప్ ఘటనను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా చెప్పారు.

sonia 02122019 2

ఆ సమయంలో, ఆ వైద్యురాలు తన సోదరికి కాల్ చేసిందని, ఆ సమయంలో ఆమె మాట్లాడుతూ.. ‘భయమేస్తోందిరా’ అని తెలుగులో చెప్పిందని, ఆ భయం కేవలం ఆ ఒక్క యువతికేది మాత్రమే కాదని, మన దేశంలోని ప్రతి మహిళ, ప్రతి తల్లి, ప్రతి చెల్లి కూడా, ఇలా భయపడుతూనే ఉన్నారని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇలాంటి దారుణాలకు పాల్పడే వారికి, మరణ శిక్షే సరైనది అని అన్నారు. మహిళ భద్రతపై పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించాలని, తప్పు అంటే తప్పు అని, వారికి తెలిసి రావాలని అన్నారు. రామ్మోహన్ నాయుడు చెప్పిన విధానానికి మెచ్చిన కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ, బల్ల చరుస్తూ, రామ్మోహన్ నాయుడు ప్రసంగాన్ని మెచ్చుకున్నారు.

sonia 02122019 3

సోనియా గాంధీ బల్ల చరుస్తూ ఉండటంతో, మిగతా ఎంపీలు కూడా అభినందించారు. ఇలా రామ్మోహన్ నాయుడు, తన స్పీచ్ తో, అటు అర్ధవంతమైన చర్చ జరుపుతూనే, ఇటు అందరి మన్ననలు పొందారు. గతంలో కూడా రాంమోహన్ నాయుడు ఇచ్చిన అనేక స్పీచ్ లకు, అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా, గతంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పై, పెట్టిన అవిశ్వాస తీర్మానం సమయంలో, రామ్మోహన్ నాయుడు, హిందీలో ఇచ్చిన స్పీచ్, ఇప్పటికీ ప్రజలకు గుర్తు ఉంది. మనకు రావలసిన హక్కుల పై, అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ఆంధ్రప్రదేశ్ హక్కుల విషయం ప్రస్తావిస్తూ, పార్లమెంట్ వేదికగా రామ్మోహన్ నాయుడు చేసిన ప్రసంగం, తన తండ్రి ఎర్రం నాయుడు ప్రసంగాలను గుర్తు చేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read