2019 లోక్‌సభ ఎన్నికల పుణ్యమాని సమాజ్‌‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, బీఎస్పీ చీఫ్ మాయావతిల మధ్య దశాబ్దాల పాటు కొనసాగిన వైరానికి తెరపడింది. దాదాపు పాతికేళ్ల తర్వాత ఇద్దరూ మళ్లీ ఒకేవేదికపై కనిపించారు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కంచుకోట మయిన్‌పురిలో శుక్రవారం ఎస్పీ-బీస్పీ-ఆర్ఎల్‌డీ సంయుక్తంగా నిర్వహించిన ర్యాలీలో ఈ ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. క్రిస్టియన్ ఫీల్డ్ మైదానంలో ఈ ర్యాలీకి జరిగింది. రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పడకముందు వరకు ములాయంకు చెందిన సమాజ్‌ వాదీ పార్టీ (ఎస్పీ), మాయావతికి చెందిన బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ)కి మధ్యే పోటీ అధికంగా ఉండేది. ప్రస్తుతం ఎస్పీ బాధ్యతలు అఖిలేశ్‌ యాదవ్‌ నిర్వహిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్న సందర్భంగా శుక్రవారం మెయిన్‌పురిలో ప్రచార సభను నిర్వహించారు. ఇందులో ఇరు పార్టీల అగ్రనేతలందరూ హాజరయ్యారు.

modi sp bsp 19042019

ఈ సందర్భంగా ములాయం మాట్లాడుతూ... ‘ఎస్పీ మద్దతుదారులంతా మాయావతిని ఎల్లప్పుడూ గౌరవించాలి. మనకు ఎప్పుడు అవసరం వచ్చినా ఆమె మనకు మద్దతుగా నిలబడ్డారు. నాకు ఓటు వేయమని మిమ్మల్ని కోరడానికి ఆమె ఈ రోజు ఇక్కడకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ... ‘మెయిన్‌పురిలో అందరూ ములాయం సింగ్ యాదవ్‌కు మద్దతు తెలపండి. ఎస్పీకి ఓట్లు వేయండి. ఆయన వెనకబడిన తరగతుల వారి అభివృద్ధి కోసం కృషి చేసే నిజమైన నేత. మెయిన్‌పురిలో ఆయన చాలా కాలంగా గెలుపొందుతున్నారు.ఎస్పీ గుర్తు సైకిల్‌ను మర్చిపోకండి. ఆయనను గెలిపించండి‌’ అని వ్యాఖ్యానించారు.

modi sp bsp 19042019

1995లో స్టేట్ గెస్ట్ హౌస్‌లో మాయావతి, బీఎస్పీ కార్యకర్తలపై ఎస్పీ శ్రేణులు దాడులకు పాల్పడడంతో... ములాయం, మాయావతి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తినట్టు చెబుతారు. ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో మయిన్‌పురి నుంచి పోటీ చేస్తున్న ఎస్పీ కురువృద్ధుడు ములాయం... ఇంతకుముందు దేవ్‌బంద్, బదౌన్, ఆగ్రాలో జరిగిన మూడు సంయుక్త ర్యాలీలకు హాజరు కాలేదు. దీంతో బీఎస్పీతో పొత్తుపెట్టుకోవడం ఇష్టంలేకే ఆయన దూరం జరిగారంటూ వార్తలు వచ్చాయి. వాస్తవానికి మయిన్‌పురిలో జరిగే ర్యాలీకి కూడా రాకూడదని ఆయన నిర్ణయించుకున్నారనీ... అయితే ఆయన కుమారుడు, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ బుజ్జగించడంతో మొత్తబడ్డారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పోయినసారి అత్యధిక ఎంపీ స్థానాలు యుపి నుంచి పొందిన బీజేపీ, ఇప్పుడు ఎస్పీ, బీఎస్పీ పొత్తుతో, అత్యధిక స్థానాలు పోగొట్టుకోనుందని, విశ్లేషకులు చెప్తున్నారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read