కోర్టులు తీరు సరిగ్గా లేదని తమ్మినేని సీతారం అన్నారు. కోర్టులు అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకుంటుంటే, ఇక సియం, మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఉండి, ఏం లాభం అన్నారు తమ్మినేని. కోర్టుల నుంచి పరిపాలిస్తారా అని తమ్మినేని అన్నారు. పరిపాలనలో కోర్టుల జోక్యం ఎక్కువైందని అన్నారు. "కోర్టులు నుంచి ఆదేశాలు వస్తున్నాయి. ఇది ఆపు, అక్కడకు వెళ్ళు, ఇది స్టాప్ చెయ్యి అంటూ, ఆదేశాలు ఇస్తున్నారు. ఇక అన్నీ వాళ్ళే చేస్తున్నప్పుడు, ప్రజలు ఎందుకు ? ఎన్నికలు ఎందుకు ? ఓట్లు ఎందుకు ?ఎమ్మెల్యేలు ఎందుకు ? ఎంపీలు ఎందుకు ?శాసన సభ ఎందుకు ? అక్కడ ఒక నాయకుడు ఎందుకు ? ముఖ్యమంత్రులు ఎందుకు ? స్పీకర్లు ఎందుకు ? ఇవన్నీ దేనికి ? నేను ఏమి అడుగుతాంటే, డైరెక్ట్ గా మీరే అక్కడ నుంచి రూల్ చేస్తారా ? న్యాయస్థానాల నుంచి ప్రభుత్వాలను నడిపిస్తారా ? న్యాయస్థానాలు, ఈ విధమైన డైరెక్షన్స్ ఇస్తున్నాయి. అయినా బాధతో అంగీకరిస్తున్నాం. రాజ్యాంగం రాసిన వాళ్ళు, ఈ రోజు జరుగుతున్నవి అలోచించి ఉండి ఉంటే, అప్పుడే ఇలాంటి వాటికి ప్రత్యామ్న్యాయం రాసే వారు ఏమో. తీర్పులు వస్తాయని, ఇలాంటివి జరుగుతాయని, వాళ్ళు అనుకుని ఉండరు. లేకపోతే, ఏదో ఒక ఏర్పాటు చేసి ఉండే వాళ్ళేమో. మా నిర్ణయాలు తప్పు అయితే ప్రజలు ఓడిస్తారు. రాజ్యాంగాన్ని గౌరవించి ముందుకు వెళ్తున్నాం" అని స్పీకర్ అన్నారు.

రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ఆయన స్పీకర్. స్పీకర్ కి, కొన్ని లక్ష్మణ రేఖలు ఉంటాయి. ఆ లక్ష్మణ రేఖలు దాటి మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడకూడదు అని నిబంధనలు లేవు కాని, స్వీయ నియంత్రణ ఉండాలి. స్పీకర్ కు ఆంక్షలు లేవని, న్యాయ వ్యవస్థకు కూడా వ్యతిరేకంగా మాట్లాడతారా ? స్పీకరే ఇలా మాట్లాడితే, ప్రజలు ఎలా గౌరవం ఇస్తారు ? ఇది రాజకీయ అరాచకత్వం. ఆయన రాజకీయ నాయకుడిగా ఉండాలి అనుకుంటే, స్పీకర్ పదవికి రాజీనామా చేసి, రాజకీయ నాయకుడిగా ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు. స్పీకర్ గా ఉంటూ, తన పరిధి దాటి, ఇలా మాట్లాడుతూ, చివరకు న్యాయవస్థను ప్రశ్నించే స్థాయికి వెళ్లి పోయారు. నిబంధనలు స్పీకరే అతిక్రమిస్తే, ఇక సామాన్య ప్రజలు ఏమి చేస్తారు ? మంచిగా ఉంటే కోర్టులు ఏమి చేస్తాయి ? చట్ట విరుద్ధంగా వెళ్తే కోర్టులు, చట్ట ప్రకారం నిర్ణయాలు ప్రకటిస్తాయి. కోర్టులుకే ఈ అధికారం ఉంది. అలాంటి కోర్టులనే, ఇష్టం వచ్చినట్టు మాట్లడటం దారుణం" అని నారాయణ అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read