అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం నిత్య‌మూ ధ‌ర్మాలు వ‌ల్లిస్తారు. ఆయ‌నే బూతులు మాట్లాడుతూ నీతుల గురించి ప్ర‌వ‌చ‌నాలు చెబుతారు. స్పీక‌ర్ వంటి గౌర‌వ‌స్థానంలో ఉన్న తమ్మినేని సీతారాం చ‌దువు ఫేక్ అని టిడిపి ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టింది. డిగ్రీ చదవుకుండానే మూడేళ్ల లా కోర్సులో ఎలా జాయినయ్యారని ప్ర‌శ్నిస్తోంది. డిగ్రీ డిస్ కంటిన్యూడ్ తమ్మినేని  3ఏళ్ల ఎల్ఎల్బీ కోర్సులో ఎలా అడ్మిషన్ పొందారని తెలంగాణ టీడీపీ నేతలు ప్రశ్నించారు. హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన  తెలంగాణ టీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డి  రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న త‌మ్మినేని సీతారాంకి త‌ప్పుడు డిగ్రీ పెట్టుకునే మినహాయింపులు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు.   తమ్మినేని సీతారాం   2019 లో స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత  ఉన్నత చదువు కోసం ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మహాత్మాగాంధీ లా కాలేజీ లో ఎల్ఎల్బీ 3సంవత్సరాల కోర్స్ చదవటానికి అడ్మిషన్ పొందార‌ని ఆధారాలు బ‌య‌ట‌పెట్టారు. ఎల్ఎల్బీ 3సంవత్సరాల కోర్స్ చదవాలంటే కచ్చితంగా డిగ్రీ పాసై ఉండాలి. లేదా డిగ్రీకి సమానమైన అర్హత కలిగిన కోర్స్ పూర్తి చేసినవారు మాత్రమే ఎల్ఎల్బి 3 సంవత్సరాల కోర్స్ పూర్తి చేయడానికి అర్హులన్నారు. కానీ  డిగ్రీ మధ్యలోనే ఆపేసిన‌  తమ్మినేని సీతారాం మూడేళ్ల కోర్సులో ఎలా అడ్మిష‌న్‌ పొందారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా నర్సిరెడ్డి చెప్పుకొచ్చారు.  అనేక టీవీ ఇంటర్వ్యూలలోనే 'డిగ్రీ డిస్ కంటిన్యూడ్' చేసినట్లు తమ్మినేని స్వయంగా చెప్పారని   తన ఎన్నికల అఫిడవిట్లో విద్యార్హతగా  "డిగ్రీ డిస్ కంటిన్యూడ్" అని రాశారన్నారు. దీనిపై అత్యున్నతస్థాయి విచారణ జరిపి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని న‌ర్సిరెడ్డి డిమాండ్ చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read