మూడు రోజు అసెంబ్లీ సమావేశాలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య జరుగుతున్నాయి. ఈ రోజు అసెంబ్లీ మొదలు కాక ముందు, తెలుగుదేశం పార్టీ, పెంచిన ఆర్టీసీ చార్జీల పై, అసెంబ్లీ వద్ద నిరసన చేపట్టింది. ఈ నిరసనలో చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణతో పాటుగా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలని నిరసన తెలియ చేసారు. ప్రజల పై అధిక భారం మోపుతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరి పై ఈ భారం పడుతుందని అన్నారు. అయితే నిరసన తరువాత అసెంబ్లీ అడుగు పెడుతున్న టిడిపి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అసెంబ్లీ మెయిన్‌ గేట్‌ దగ్గర అడ్డుకున్నారు. ఈ సమయంలో, చీఫ్‌ మార్షల్‌ పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ సంధ్యారాణి నుంచి చీఫ్‌ మార్షల్‌ ప్లకార్డ్‌ ను లాక్కున్నారు. అలాగే మిగతా వారి నుంచి కూడా లాక్కోండి అంటూ, మార్షల్స్ ని ఆదేశించటంతో, చంద్రబాబు ఫైర్ అయ్యారు. సీఎం ఉన్మాది అయితే, అధికారులు కూడా ఉన్మాదులవుతారా? అంటూ చీఫ్‌ మార్షల్‌పై చంద్రబాబు మండిపడ్డారు.

speaker 11122019 2

అయితే చంద్రబాబు సభలోకి వచ్చిన తరువాత కూడా, చంద్రబాబుని టార్గెట్ చేస్తూ, వైసీపీ ఎదురు దాడి కొనసాగిస్తూనే ఉంది. చంద్రబాబు పై పర్సనల్ కామెంట్స్ చేస్తూ, చంద్రబాబుని ఇబ్బంది పెట్టే కార్యక్రమం మొదలు పెట్టరు. ఇంగ్లీష్ మీడియం పై ప్రశ్నకు చంద్రబాబు మాట్లాడుతూ, ఇంగ్లీష్ మీడియంతో పాటుగా, తెలుగు మీడియం ఆప్షన్ కూడా ఉండాలి అంటూ సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబుకి ఇంగ్లీష్ రాదని, బ్రీఫీడ్ మీ అంటూ, వచ్చీ రాని ఇంగ్లీష్ మాట్లాడతారని ఎగతాళి చేసారు. దీనికి చంద్రబాబు సమాధానం ఇస్తూ, తనకు వచ్చిన ఇంగ్లీష్ తోనే, విదేశాల నుంచి పెట్టుబడులు తెచ్చానని, అలాగే ఎంతో మంది దేశాధినేతలు ఇక్కడకు వచ్చారని చెప్పారు.

speaker 11122019 3

దీనికి చెవిరెడ్డి వివరణ మాట్లాడుతూ, నేను పీహెచ్డీ చేసానని, చంద్రబాబు 40 ఏళ్ళ నుంచి పీహెచ్డీ చేస్తూనే ఉన్నారని అన్నారు. ఈ విషయం పై, మాట్లాడేందుకు మైక్ అడగగా, మీకు మైక్ ఇచ్చేది లేదు, ఈ టాపిక్ అయిపొయింది అంటూ, ఇదేమన్నా ఖవాలి డ్యాన్సా? ఒకరి తర్వాత మరొకరికి అవకాశం ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యానించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రతిపక్ష నేత చంద్రబాబు. చైర్‌లో నుంచి లేచి మరీ స్పీకర్‌తో వాగ్వాదానికి దిగారు. మర్యాదగా ఉండాలంటూ స్పీకర్‌నుద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. మీరు మర్యాదగా ఉంటే, మేము మర్యాద ఇస్తాం అని అనటంతో, స్పీకర్ నే మర్యాదగా ఉండమంటారా అంటూ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దు అంటూ తమ్మినేని అన్నారు. తరువాత వైసీపీ ఎమ్మెల్యేలకు అవకాసం ఇచ్చి, చంద్రబాబుకు పిచ్చి అని, చంద్రబాబుని హాస్పిటల్ లో చూపించాలని, ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా, స్పీకర్ వారికి మాట్లాడే అవకాసం ఇచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read