2024 ఎలక్షన్స్ కు టీడీపీ పూర్తి స్థాయిలో సిద్దం అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు జరుగుతున్న ఈ సమావేశం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఒక స్పెషల్ గెస్ట్ ను తీసుకొచ్చినట్టు తెలుస్తుంది.ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ ను ఎలాగైనా గద్దె దించి , ప్రజా అభివృద్దే లక్ష్యంగా పని చేయాలని పార్టీ నేతలకు చంద్ర బాబు ఆదేశించారని, ఆ ప్రకారమే కార్యాచరణ ఖరారు చేయనున్నారు. వచ్చే ఎన్నికల వరకు పార్టీ భవిష్యత్ ప్రణాళికలను ఈ రోజు ప్రకటించనున్నారు. అంతే కాకుండా చంద్రబాబు ఏ జిల్లాల్లో పర్యటనలు చేస్తారో ఈ రోజు ఖరారు చేయనున్నారు. త్వరలో జరిగే లోకేశ్ పాదయాత్ర పైనా కూడా ఈ సమావేశంలో ఒక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.

అంతే కాకుండా ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఏ విదంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, రాజకీయంగా టిడిపి పార్టీ ని ఏ విదంగా ముందుకు తీసుకెళ్ళాలి అని కూడా చంద్రబాబు పార్టీ నేతలకు దిశ, నిర్దేశం చేయనున్నారు.అయితే ఈ కార్యక్రమానికి, ప్రత్యేకంగా ఇప్పటి వరకు తెర వెనుక ఉండి పార్టీకి వ్యూహాలు రచిస్తున్న-ప్రణాళికలు సిద్దం చేస్తున్న రాబిన్ శర్మ హాజరవుతున్నారు. 2019 ఎలక్షన్స్ ముందు రాబిన్ శర్మ, ప్రశాంత్ కిశోర్ తో కలిసి ఐ ప్యాక్ తరపున అప్పట్లో వైసీపీ కోసం పని చేసారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ నుంచి రాబిన్ శర్మ దూరం అవ్వడంతో ,ఇప్పుడు టీడీపీ కోసం పని చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read