ఇండోనేషియా ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్లలో విజేతగా నిలిచిన కిదాంబి శ్రీకాంత్ ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, విజయవాడలో సన్మానించారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ చంద్రబాబుకి గిఫ్ట్ ఇచ్చారు. సన్మానం చేస్తారు అనుకున్న చంద్రబాబుకే శ్రీకాంత్ గిఫ్ట్ ఇవ్వటంతో అక్కడవారి ఆశ్చర్యంగా చూసారు.

ముఖ్యమంత్రికి శ్రీకాంత్ విదేశాల నుంచి తెచ్చిన షటీల్ బ్యాట్ బహుమతిగా అందించారు. అదే బ్యాట్ తో సభా వేదిక పై ముఖ్యమంత్రి, కిదాంబి శ్రీకాంత్ షటీల్ ఆడి ఆహుతులను ఉత్సాహపరిచారు.

సాక్షాత్తు ముఖ్యమంత్రి కే గిఫ్ట్ ఇచ్చారు ఏంటి అని మీడియా అడిగినప్పుడు, శ్రీకాంత్ మాట్లాడుతూ, "ఆయనకు ఏదైనా కానుక ఇవ్వాలనిపించింది. కానీ నేనేం ఇవ్వగలను. అందుకే క్రీడాకారుడిగా ఓ రాకెట్ బహుమతిగా ఇచ్చాను. ఆయనతో వేదిక పై ఆడలనుకున్నా కానీ, కాస్త ఆలోచించాను. అయితే సియం కూడా చొరవ చూపడంతో నాకూ ధ్యైరం వచ్చి ఆడేసాను " అన్నారు....

Advertisements

Advertisements

Latest Articles

Most Read