ఆంధ్రలో పుట్టి, ఆంధ్రులుగా చెప్పుకోలేని ఎంతో మంది సెలబ్రిటీలు ఉంటున్న ఈ రోజుల్లో... ధైర్యంగా, మొహమాటం లేకుండా, సూటిగా, సుత్తి లేకుండా నేను ఆంధ్రుడిని అని స్పష్టంగా చెప్పాడు మన శ్రీకాంత్.... భవిష్యత్తులో ఆంధ్రకే ఆడతాను అని తేల్చి చెప్పాడు. ఈ దమ్ము, ధైర్యం ఆంధ్రోడికే సొంతం. తిప్పరా మీసం అనే విధంగా, గుంటూరు మిర్చీ ఘాటు చూపించాడు... తోటి క్రీడాకారిణి చేయలేని పనిని, చేసి చూపించి, ప్రతి ఒక్క ఆంధ్రుడి హృదయానికి దెగ్గరయ్యడు...

బుధవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇండోనేషియా ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్లలో విజేతగా నిలిచిన కిదాంబి శ్రీకాంత్ ను ముఖ్యమంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్వయంగా సన్మాన సభ ఏర్పాటు చేయడం, ఆనందంగా గర్వంగా ఉందని, గోపిచంద్ అకాడమి ఏర్పాటుకు ముఖ్యమంత్రే కారకులని, ఆ అకాడమి వల్లే నేను విజయం సాధించడం సాధ్యమయిందని చెప్పారు. ముఖ్యమంత్రి లేకపోతే నేను, మేము లేమని, ముఖ్యమంత్రి సహకారం క్రీడాకారులకు ఎల్లప్పడు ఇలాగే ఉండాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ, బ్యాడ్మింటన్‌ లో ఇన్ని పతకాలు వస్తున్నాయింటే, దానికి కారణం చంద్రబాబే అన్నారు.

ఇక్కడితో ఆగలేదు... తెలంగాణా వాడైతే "తెలంగాణా ముద్దు బిడ్డ" అని, ఆంధ్రప్రదేశ్ వాడైతే, "తెలుగు ముద్దు బిడ్డ" అని సంబోధించే హైదరాబాద్ మీడియాకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు.... ఎంతో గర్వంగా "నేను ఆంధ్రోడిని, నాది గుంటూరు, నాకు చంద్రబాబు గారు ఇన్‌స్పిరేషన్‌ అని" ధైర్యంగా, మొహమాటం లేకుండా కుండబద్దులు కొట్టి, ఆంధ్రోడి పౌరుషం చూపించాడు...

శభాష్ శ్రీకాంత్...

Advertisements

Advertisements

Latest Articles

Most Read