మహారాష్ట్రకు చెందిన లీగల్ రైట్స్ అడ్వైజరీ కన్వీనర్ వినయ్ జోషి , నిన్న కేంద్ర హోం శాఖ కార్యదర్శికి, ఆంధ్రప్రదేశ్ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ పై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఏపి సిఐడి చీఫ్ సునీల్ కుమార్, హిందూ మతానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని, సర్వీస్ రూల్స్ నిబంధనలకు వ్యతిరేకంగా ఆయన వ్యావహరిస్తున్నారని, ఆయన ప్రసంగాలు మతాల మధ్య, కులాల మధ్య చిచ్చుకి ప్రయత్నం చేస్తున్నారని, సర్వీస్ రూల్స్ కు వ్యతిరేకంగా ఆయన చేస్తున్న ప్రచారం పై, దర్యాప్తు జరిపి, ఆయన పై చర్యలు తీసుకోవాలని, ఆయన్ను సర్వీస్ నుంచి తొలగించాలని కేంద్రానికి నిన్న ఫిర్యాదు చేసారు. దీంతో పాటుగా, ఆయన ఎస్సీ రిజర్వేషన్ అంటూ, ఆ రిజర్వేషన్ పొంది, మతం మార్చుకున్నారని, మతం మార్చుకుంటే, ఆయన తన పదవికి అనర్హుడు అవుతారని, తొలగించాలని డిమాండ్ చేసారు. గతంలో మద్రాస్ హైకోర్టు కూడా ఇలాంటి కేసులు పై తీర్పు ఇచ్చిందని, ఆయన పై చర్యలు తీసుకోవాలని సునీల్ కుమార్ పై, ఫిర్యాదు చేసారు. అయితే ఫిర్యాదు చేస్తూ, సునీల్ కుమార్ ఏవైతే ప్రసంగాలు చేసారో, ఆ ప్రసంగాలకు సంబంధించిన ఆధారాలు అన్నీ, కూడా ఆ ఫిర్యాదులో పొందు పరిచారు. ఈ ఆధారాలు అన్నీ కూడా youtube, ట్విట్టర్ లో ఆయన చేసిన ప్రసంగాల, URL లింక్ లు అన్నీ కూడా తన ఫిర్యాదులో తెలిపారు.

sunil 10062021 2

ఆ వీడియో క్లిప్ లు కూడా డౌన్లోడ్ చేసి ఫిర్యాదులో ఇచ్చారు. అయితే, ఈ రోజు ఆయన ఇచ్చిన ఫిర్యాదులోని URL లింక్ లు క్లిక్ చేస్తే, వీడియోలు ఏమి అందులో లేవని, ఆ లింకులు నుంచి వీడియోలు తొలగించినట్టు తెలుస్తుందని, ఫిర్యాదుదారుడు ఆరోపిస్తున్నారు. ఇదే విషయం పై ఆ సంస్థ పీవీ సునీల్ కుమార్ ను ట్విట్టర్ ద్వారా ప్రశ్నించింది. ఎందుకు ట్విట్టర్ నుంచి, youtube నుంచి ఆ వీడియోలు అన్నీ మాయం అయ్యాయి ? ఆ నేరాన్ని మీరు అంగీకరిస్తున్నారా అంటూ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించింది. ఈ లింక్ ల్లో ఉన్న వీడియోలు అన్నీ మాయం కావటం పై, ఇది ఎవరు చేసారు అనే విషయం కూడా దర్యాప్తు చేయలని కేంద్రాన్ని కోరింది లీగల్ రైట్స్ అడ్వైజరీ. కేంద్ర హోం శాఖ ఈ విషయం పై ఇప్పుడు ఎలా స్పందిస్తుందో చూడాలి. తమకు ఫిర్యాదు అందిన తరువాత, ఆ వీడియోలు మాయం అయినట్టు విచారణలో తేలితే మాత్రం, బాధ్యుల పై చర్యలు తప్పవనే చెప్పాలి. మరి ఈ విషయం ఎంత వరకు వెళ్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read