ప్రభుత్వ కార్యాలయాలకు అధికార పార్టీని పోలిన రంగులు వేయడాన్ని తప్పుపడుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్ ఇస్తూ బుధవారం తీర్పును ఇచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన రంగులను నాలుగు వారాల్లో తొలిగించాలని ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన అధికార పార్టీ వైఎస్సాఆర్ కాంగ్రెస్ జెండాను పోలిన రంగులను తొలిగించాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌పై విచారణ చేపట్టిటన సుప్రీం కోర్టు నాలుగు వారాల్లో రంగులను తొలిగించకుంటే కోర్టు దిక్కారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది. మొత్తం 7 పేజీల తీర్పులో, సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా స్పష్టంగా ఉందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ తీర్పుపై ఏపీ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పు తరువాత రంగులు తొలిగించకుండా తప్పు చేసారని ధర్మాసనం అభిప్రాయపడింది. ఒక సారి జీవో కొట్టివేసిన తరువాత మళ్ళీ వేరే రంగు జతచేసి జీవో ఎందుకు తెచ్చారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కోర్టు తీర్పులు అమలు చెయ్యకపోతే, అది న్యాయస్థానాల ప్రతిష్టను దిగజారుస్తాయని కోర్టు ఘాటుగా చెప్పింది.

ప్రభుత్వ కార్యాలయాలకు రంగులకు వేసే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో సంఖ్య 623ని న్యాయస్థానం రద్దు చేసింది. అయితే ఇదే సందర్భంలో, ప్రభుత్వం తరుపు న్యాయవాది చేసిన వాదనలను, సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. మూడు రంగులకు తోడు, మట్టి రంగు వెయ్యాలని నిర్ణయం తీసుకున్నామని, దీనికి సంబంధించి జీవో ఇచ్చాం కాని, ఎక్కడా రంగులు వెయ్యలేదు అంటూ, ప్రభుత్వం వాదించటంతో, సుప్రీం సీరియస్ అయ్యింది. ఆదేశాలు అయితే ఇచ్చి జీవో ఇచ్చారు కదా, మొత్తం రంగులు వేసే దాకా, చూస్తూ ఉండమంటారా ? అయినా మూడు రంగులు అలాగే ఉంచి, మరో రంగు జోడించటం, కోర్టు దిక్కరణ అవుతుంది కదా అని కోర్టు ప్రశ్నించింది. అలాగే, తమకు లాక్ డౌన్ అయిన తరువాత, మూడు వారాల్లో రంగులు తొలగించమని హైకోర్టు చెప్పింది అని, అయినా ఇప్పుడే తమ పై కోర్టు ధిక్కరణ కింద హైకోర్టు వెళ్ళింది అని చెప్పగా, రెండు వారాల్లో మీరు రంగులు తీస్తారా అని సుప్రీం అడగగా, నాలుగు వారాలు గడువు కావాలని ప్రభుత్వం కోరటంతో, సుప్రీం కోర్టు ఒప్పుకుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read