హెటిరో  డ్రగ్స్ కి సంబంధించిన కేసులో ఏపీ సీఎం జగన్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జగన్ అక్రమ ఆస్తులకు సంబంధించిన కేసు సిబిఐ కోర్టులో నడుస్తున్న విషయం తెలిసిందే. ఆ అక్రమాస్తుల కేసు దాఖలు చేసినప్పుడు హెటిరో కు సంబంధించిన కేసు కూడా చేర్చడం జరిగింది. హెటిరో కంపెనీ జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టటం వలనే, ఈ కంపనీకి వెంటనే80 ఎకరాల ల్యాండు ఎలాట్ చేశారనేది అభియోగం. గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ల్యాండ్ కోసం ఎన్నో కంపెనీలు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, అప్పటికి ఇంకా కంపెనీ కూడా మొదలుపెట్టని , ఈ హెటిరో కంపెనీకి  80 ఎకరాల ల్యాండు రాజ శేఖర్ రెడ్డి ఉన్న టైం లోనే  ఎలాట్ చేశారు.   కేవలం 350 షేర్లు పెట్టుబడి పెట్టడంతో వెంటనే ఈ కంపెనీకి ఈ ల్యాండ్ ఎలాట్ చేయడం జరిగింది. అయితే ఇదే కంపెనీ, వెంటనే జగన్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టింది. ఈ అన్ని కేసులకు సంభందించి సిబిఐ ఛార్జిషీట్ గట్టిగానే దాఖలు చేసింది. కాబట్టి జగన్ అక్రమాస్తుల కేసులో హెటిరో దాఖలు చేసినటువంటి కేసుని కొట్టివేయడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించడం జరిగింది. మరో వైపు హెటిరో కంపెనీ కూడా తమ న్యాయవాదులతో తమ వాదనను వినిపించాయి. కంపెనీ మొత్తాన్ని, ఎఫ్ఐఆర్లో చేర్చడం, కంపెనీ మొత్తాన్ని నిందితుల జాబితాలో చేర్చడం అనేది సబబు కాదని, ఆ కంపెనీలో పనిచేసే కొంతమంది వ్యక్తులను  జాబితాలో చేర్చాలని, అంతేకానీ కంపెనీ మొత్తాన్ని చార్జ్షీట్ లో చేర్చడం  సబబు కాదు అని  కంపెనీ తరుపున న్యాయవాదులు తమ వాదన  వినిపించారు. ఈ హెటిరో  కంపెనీకి , కింద కోర్టు హైకోర్టులో కూడా  ఇలాగే చుక్కెదురవడంతో సుప్రీంకోర్టులో సవాలు చేసింది. కాని సుప్రీం కోర్టులో కూడా ,ఈ హెటిరో కంపనీని చార్జ్ షీట్ నుంచి తొలగించడం కుదరదని సుప్రీం కోర్ట్ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అంతే కాదు, ఇక్కడ క్విడ్ ప్రో కో జరిగిందని, స్పష్టంగా తెలుస్తుందని, సిబిఐ అన్నీ పక్కాగానే చేసిందని కామెంట్ కూడా చేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read