ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఎన్నికల కమీషనర్ గా నియమిస్తూ, హైకోర్టు తీర్పు పై స్టే ఇవ్వాలి అంటూ, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు కు వెళ్ళింది. హైకోర్టు తీర్పు పై స్టే ఇవ్వాలని కోరింది. అయితే స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ పిటీషన్ ను డిస్పోస్ చేసే ఆలోచనలో ఉన్నామని, మీ వాదనలు వినిపించండి అంటూ, కేసును మూడు వారాలు వాయిదా వేసింది సుప్రీం కోర్టు. అయితే ఈ సందర్భంలో, సుప్రీం కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. నిమ్మగడ్డ తిరిగి బాధ్యతలు స్వీకరించినట్లేనని తాము భావిస్తున్నామనే అర్ధం వచ్చే విధంగా సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చెయ్యటం గమానార్హం. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఎదుట వాదనలు కొనసాగాయి. ఈ కేసును పూర్తిస్థాయిలో విచారిస్తామని ఇరువర్గాలు వాదనలకు సిద్ధం కావాలని చెప్తూ, విచారణ మరో మూడు వారాలకు వాయిదా వేసింది సుప్రీం కోర్టు.

అయితే ఈ సందర్భంలో ప్రభుత్వ తరుపు లాయర్ మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధ పదవి ఖాళీగా ఉండ కూడదు అని, తగు ఆదేశాలు ఇవ్వాలి అంటూ, వాదించగా, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పదవి ఖాళీగా లేదు కదా అంటూ, హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పై, తాము స్టే ఇవ్వలేదు కదా అని చెప్తూ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవిలో ఉన్నట్టే భావిస్తున్నాం అనే అర్ధం వచ్చే విధంగా వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు తుది నిర్ణయం ప్రకటిస్తూ, కనకరాజ్ నియామకం కొట్టేసి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని రీస్టోర్ చేస్తూ ఆదేశాలు ఇచ్చినట్ట తెలిసిందే. దీంతో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేస్తూ, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పదవి ఖాళీ లేదు కదా అని చెప్పటంతో, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని సుప్రీం కోర్టు, ఎస్ఈసీ గుర్తించిందనే చెప్పాలి. ఈ మొత్తం వ్యవహారంలో, చట్టాలను కాదని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, సుప్రీం కోర్టులో కూడా నిలవదు అనే చెప్పాలి. చూద్దాం ఏమి జరుగుతుందో.

Advertisements

Advertisements

Latest Articles

Most Read