ముజఫర్‌పుర్‌ వసతిగృహ అత్యాచారాల కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న ఎస్‌కే శర్మను బదిలీ చేసి సీబీఐ అదనపు డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు అత్యున్నత న్యాయస్థానం నిర్ధారించింది. ఇందుకు గానూ ఆయనకు న్యాయస్థానం అసాధారణ శిక్ష విధించింది. రూ. లక్ష జరిమానాతో పాటు నేటి కోర్టు కార్యకలాపాలు ముగిసేంతవరకు కోర్టు ప్రాంగణంలోనే ఆ మూల కూర్చోవాలి అంటూ ఆదేశించింది. "You both go and sit in one corner of the court till we rise" అంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్‌ అన్నారు. ఉద్దేశపూర్వకంగా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గొగొయ్ ఆయనకు లక్ష రూపాయల ఫైన్ వేసి.. CJI కోర్టు రూమ్‌లో కూర్చోవాలని ఆదేశించారు. నాగేశ్వర్‌రావుతో పాటు సీబీఐ న్యాయ సలహాదారుకు కూడా ఇదే శిక్ష వర్తిస్తుందని గొగొయ్‌ స్పష్టంచేశారు.

cbi 12212019

ముజఫర్‌పుర్‌ అత్యాచారాల కేసు దర్యాప్తు నుంచి అధికారులను బదిలీ చేయవద్దని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసింది. అయితే ఈ ఆదేశాలను పక్కనబెట్టి నాగేశ్వరరావు తాను తాత్కాలిక డైరెక్టర్‌గా ఉన్న సమయంలో ఎస్‌కే శర్మను దర్యాప్తు నుంచి తప్పించారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాగేశ్వరరావుకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి నాగేశ్వరరావు నేడు కోర్టు ఎదుట హాజరయ్యారు. ఆయన తరఫున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ వాదనలు వినిపించారు. నాగేశ్వరరావు ఉద్దేశపూర్వకంగా చేయలేదని, అయితే ఇందుకు ఆయన ఇప్పటికే బేషరతుగా క్షమాపణలు చెప్పినట్లు కేకే వేణుగోపాల్ న్యాయస్థానానికి విన్నవించారు.

cbi 12212019

అయితే దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘ఇది కోర్టు ధిక్కారం కాకపోతే మరేంటీ..? దీనికి శిక్ష పడాల్సిందే. నాగేశ్వరరావుకు రూ. లక్ష జరిమానా విధిస్తున్నాం. దీంతో పాటు ఈ రోజంతా మీరు ఇక్కడే ఉండాలి. కోర్టు కార్యకలాపాలు ముగిసేంతవరకు వెళ్లి కోర్టు గదిలో ఓ పక్కన కూర్చోండి’ అని ధర్మాసనం ఆదేశించింది. మరోవైపు తాను తప్పు చేశానని అంగీకరించిన నాగేశ్వరరావు క్షమాపణ కోరుతూ కోర్టులో నిన్న ప్రమాణపత్రాన్ని‌ సమర్పించారు. ప్రభుత్వ అధికారులు చట్టానికి లోబడి పని చేయాలనీ, రాజకీయ నాయకులకు లోబడి కాదని సీజేఐ రంజన్ గొగోయ్ హితబోధ చేశారు. కోర్టు ఆదేశాలతో ఆటలాడుకోవద్దంటూ హెచ్చరించారు.

Advertisements

Add comment


Security code
Refresh

Advertisements

Latest Articles

Most Read