ఊరందరిది ఒక దారైతే ఉలిపికట్టది మరో దారని, అన్ని రాష్ట్రాలు నిర్ణయాలు ఒక వైపు అయితే మన రాష్ట్ర రూటు సపరేటు అన్నట్లు ఉంది. కరోనా మూడవ దశ ఎక్కువగా ఉన్న దశలో, దేశం అంతటా వ్యాపిస్తున్న నేపధ్యంలో అన్ని రాష్ట్రాలు ఎవరికి వారు జాగ్రత్త పడుతున్నారు. అయితే సంక్రాంతి పండుగ అయిపోవడంతో రాష్ట్రాలలో స్కూల్స్ , కాలేజీలు మళ్ళి మొదలు కాబోతున్నాయి. మన రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో సంక్రాంతి సెలవులు పెంచడమో లేక మళ్ళి ఆన్లైన్ లోనే క్లాసులు పెడతారని అందరూ భావించారు. అయితే తెలంగాణలో కూడా బాగా కేసులు పెరుగుతుండటంతో ఈ నెల 30 తేది వరకు పాఠశాలలకు సెలవలు పొడిగించారు. అదే విధంగా మన రాష్ట్రం లో కుడా పొడిగిస్తారని అటు విద్యార్ధులు, తల్లితండ్రులు కుడా భావించారు. ఈ విషయం పై విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందిస్తూ మన రాష్ట్రంలో ఎటువంటి సెలవలు పొడిగింపు లేవని ఈ రోజు నుంచి యధావిధిగా స్కూల్స్ కాలేజీలు ప్రారంభమవుతాయని ఆయన స్పష్టం చేసారు. కేసులు తీవ్రత పెరిగితే అప్పుడు ఆలోచిస్తామని ఆయన చెప్పారు. అయితే మంత్రి ప్రకటన పై, భగ్గుమంటున్నారు. కేసులు పెరగకుండా చూడాలి కానీ, పెరిగితే చూస్తాం అని చెప్పటం ఏమిటో అర్ధం కావటమ లేదు.

suresh 17012022 2

టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ అధ్యక్షుడు ఎంవీ ప్రణవ్‌గోపాల్‌ దీనిని తప్పు పడుతూ ఆదిమూలపు సురేష్ పై విమర్శలు చేసారు. పిల్లల జీవితాలతో ఆటలాడద్దని, అసలు 15 లోపు వయసు వారికి వాక్సిన్ అందుబాటు లోకి రాకుండా, మీరు స్కూల్స్ ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాలలాగా మీరూ కొన్ని రోజులు సెలవలు పొడిగిస్తే నష్టం ఏంటని కూడా ఆయన తప్పుబట్టారు. ఈ విద్యా శాఖా మంత్రికి విద్యా వ్యవస్థని ఎలా నిర్వర్తించాలో కూడా తెలియదని , ఇలనాటి వాళ్ళు ఉండటం మన దురదృష్టకరమని విమర్శించారు. క-రో-నా వ్యాప్తి దృష్ట్యా పరిస్థితులు సద్దుమణిగే వరకు పాఠశాలలకు సెలవులు పొడిగించాలని డిమాండ్ చేసారు. అలా కాకుండా ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం అని, రేపు కరోనా వ్యాప్తి జరిగితే, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. అయితే ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రివ్యూ జరగనుంది. ఈ రివ్యూలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం జరుగుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read