చంద్ర‌బాబు సీఎంగా ఉన్న ఐదేళ్ల‌లో ఉద్యోగ‌సంఘ నేత‌లు ఎన్ని డిమాండ్లు, ఎన్ని నిర‌స‌న‌లు చేశారో లెక్కే లేదు. వేదిక‌ల‌పై నుంచి సీఎం బాబు, నాటి స‌ర్కారుని తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టేవారు. ఏ నాడూ ఏ ఉద్యోగ‌సంఘ నేత‌ని క‌నీసం హెచ్చ‌రించిన పాపాన పోలేదు. ఫిట్మెంట్ తెలంగాణ కంటే ఎక్కువ‌గా ప్ర‌క‌టిస్తే, అప్ప‌టి టిడిపి స‌ర్కారుని అభినందించాల్సిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఎవ‌డి కోసం పెంచుతాడంటూ బ‌హిరంగ వేదిక నుంచే చంద్ర‌బాబుని తూల‌నాడుతూ మాట్లాడారు. అయినా ఏనాడూ ఆయ‌న‌పై ఏ కేసులూ స‌ర్కారు పెట్ట‌లేదు. ఉద్యోగ‌ప‌రంగా, సంఘ‌ప‌రంగా ఇబ్బందులు పెట్టలేదు. లోటు బ‌డ్జెట్‌తో ఏర్ప‌డిన రాష్ట్రంలోనూ ఉద్యోగుల‌కీ ఏ లోటూ రాకుండా చూసుకుంది టిడిపి ప్ర‌భుత్వం. అయినా స‌రే రెండుచేతుల‌తో ఓట్లు వేసి-వేయించి వైసీపీ ప్ర‌భుత్వాన్ని తెచ్చుకున్నారు ఉద్యోగులు. ఇది వారే చెప్పిన మాట‌. పాలిచ్చే ఆవుని కాద‌నుకుని త‌న్నే దున్న‌పోతుని తెచ్చుకున్న‌ట్ట‌య్యింది. త‌మ‌కి ఇచ్చిన హామీలు, న్యాయంగా రావాల్సిన ప్ర‌యోజ‌నాల కోసం చంద్ర‌బాబు మాదిరిగానే జ‌గ‌న్ రెడ్డిని డిమాండ్ చేయ‌డం మొద‌లుపెట్టారు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) స‌భ్యులు. దీంతో ఈ సంఘాన్ని ప్ర‌భుత్వం ర‌ద్దుచేసింది. కోర్టుకెళ్లిన ఏపీజీఈఏ విజ‌యం సాధించింది. అయితే జ‌గ‌న్ రెడ్డిది పాము ప‌గ‌. త‌న స‌ర్కారుకి జీ హూజూర్ అన‌కుండా పోరాటం అంటూ పెద్ద పెద్ద మాట‌లు మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) అధ్య‌క్షుడు సూర్య‌నారాయ‌ణ‌ని టార్గెట్ చేశారు. వాణిజ్య‌ప‌న్నుల‌శాఖ‌లో నిబంధ‌న‌ల‌కి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించి ప్ర‌భుత్వ ఆదాయానికి గండికొట్టార‌నే ఆరోప‌ణ‌ల కేసుని సూర్య‌నారాయ‌ణ చుట్టూ బిగించారు. ఈ కేసులో న‌లుగురిని ఇప్ప‌టికే అరెస్టు చేశారు. ఏపీజీఈఏ అధ్య‌క్షుడు సూర్య‌నారాయ‌ణ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఇది ముమ్మాటికీ ప్ర‌భుత్వ పెద్ద‌ల ఆదేశాల‌తో పెట్టిన కేస‌ని అంద‌రికీ తెలుసు. అయినా ఆ పెద్ద‌ల క‌ళ్ల‌లో ఆనందం చూడ‌టం కోసం ఏపీజీఈఏ అధ్య‌క్షుడు సూర్య‌నారాయ‌ణని అరెస్టు చేయ‌డం త‌ప్పించి పోలీసులు ఇంకేం చేయ‌లేరు. పాపం, ఉద్యోగులు-ఉద్యోగ సంఘాల నేత‌లు చంద్ర‌బాబు మాదిరిగానే బ్లాక్ మెయిల్ చేసి డిమాండ్లు సాధించుకోవ‌చ్చ‌నుకుని జ‌గ‌న్ రెడ్డి ద‌గ్గ‌ర తోక జాడించారు. ఆయ‌న తోకే కాదు జీవిత‌మే క‌ట్ చేసేలా ఉన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read