ఈ రోజు హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో సినిమా దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. సినీ పరిశ్రమ గురించి వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై తమ్మారెడ్డి తీవ్రంగా స్పందించారు. సినీ పరిశ్రమను నిందిస్తున్న నాయకులు తలదించుకోవాలని ప్రసన్నకుమార్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఎవరు బలిసారు ? మా బలుపు మీరేమి చూసారు అంటూ ఫైర్ అయ్యారు. మీ ఎమ్మెల్యేలు ఎంత ఎంత తింటున్నారో వాటి గురించి మాట్లాడదామా అని సవాల్ విసిరారు. మీ అవినీతి పై ఓపెన్ డిబేట్ కు వచ్చే దమ్ము మీకు ఉందా అని ప్రశ్నించారు. ఎవరికి బలిసిందని మీరు అంటున్నారు, ఎవరిని మెప్పించటానికి ఈ వ్యాఖ్యలు చేసారు అని అన్నారు. మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీ ఆస్తులు ఎంత, ఇప్పుడు మీ ఆస్తులు ఎంత అని అన్నారు. మీ ఆస్తులు, మా సినిమా వాళ్ళ ఆస్తులు ఎంత ఉందో లెక్క తీద్దాం రండి అని అన్నారు. మేము కష్టపడి సంపాదిస్తున్నామని, సినిమా ఊరుకే బయటకు రాదని, ఎంతో మంది కష్టపడితే వచ్చే ప్రాజెక్ట్ అని అన్నారు. కోట్లు ఖర్చు పెడితే పైసా పైసా ఏరుకుంటున్నామని అన్నారు. మీరేమో రూపాయి పెట్టి, దోచుకుంటున్నారని అన్నారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా, మా బలుపు కాకుండా, మీ బలుపు సంగతి చూసుకోండి అని అన్నారు.

tammareddy 12012022 2

అసలు ఇండస్ట్రీలో కుల ప్రస్తావన ఏంటి అని అన్నారు. మీరు ఒకే సామాజికవర్గం ఓట్లు వేస్తే గెలిచారా అని అన్నారు. మీరు కులాలు గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, సినీ ఇండస్ట్రీలో టాప్ ఇద్దరు ప్రొడ్యూసర్ లు , మీ సామాజికవర్గం వారే అని అన్నారు. సామాజిక వర్గాల పేరుతో రాద్ధాంతం ఎందుకు అని ప్రశ్నించారు. మీ బలుపు సంగతి చూసుకోండి అంటూ హెచ్చరించారు. అలాగే మరో వైసీపీ నేత, పుష్ప సినిమాలో విలన్లకు ఒక సామాజికవర్గం పేర్లు పెట్టామని, దీనికి కారణం ప్రొడ్యూసర్ కమ్మ సామాజికవర్గం అంటూ, ఆ ప్రొడ్యూసర్ పేరు వెనుక చౌదరి అనే తోక తగిలించారని అన్నారు. సినిమాని నేను మళ్ళీ చూశానని, అసలు ఆ ప్రొడ్యూసర్ పేరు వెనుక చౌదరి అనే పేరే లేదని, ఈయన తగిలించి, లేని పోనివి అన్నీ సృష్టించి, కులాల మధ్య కూడా మాట్లాడుతున్నారని తమ్మారెడ్డి ధ్వజమెత్తారు. గతంలో చంద్రబాబు ఇలా ఎప్పుడూ వ్యవహరించ లేదని అన్నారు. ఇప్పుడు తమ్మారెడ్డి చేసిన ఈ కామెంట్స్ పై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read