ఆయన ఒక అసెంబ్లీ స్పీకర్. రాజకీయాలకు అతీతంగా, ఉండే రాజ్యంగా పదవి. మొన్నే, వెంకయ్య నాయుడు లాంటి హోదాలో ఉన్న వారికి కూడా, ఎలా ఉండాలో చెప్పారు. వెంకయ్య నాయుడిని తప్పు పడుతూ, వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం, ఈ రోజు తెలుగుదేశం పార్టీ పై, ఆ నేతల పై బూతు పురాణం ఎత్తుకున్నారు. సహజంగా ఇలాంటి వ్యాఖ్యలు ఎమ్మెల్యే స్థాయి నేతలు చేసినా సెన్సేషన్ అవుతుంది. కాని ఇక్కడ మొన్న వెంకయ్య నాయుడికే స్పీకర్ అంటే ఎలా ఉండాలో పాఠాలు చెప్పిన ఏపి అసెంబ్లీ స్పీకర్ ఇలాంటి వ్యాఖ్యలు చేసారంటే, ఏమి చెప్పాలి ? ఈ దిగజారిన రాజయకీయ వ్యవస్థను ప్రక్షాళణ చెయ్యటానికే నేను వచ్చాను అని చెప్తున్న జగన్ మోహన్ రెడ్డి గారు, ఇలా దిగజారి మాట్లాడిన స్పీకర్ పై ఏమి చెప్తారు ?

tammineni 12082019 2

ఇక విషయంలోకి వస్తే, ఈ రోజు అసెంబ్లీ స్పీకర్ గా, రాజ్యాంగ పదవిలో ఉంటూ, రాగ ద్వేషాలకు, పార్టీలకు అతీతంగా ఉండాల్సిన స్పీకర్, తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ నాయకులను తిట్టి పోశారు. టీడీపీ నేతలను కౌన్‌ కిస్కాగాళ్లు అంటూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇవన్నీ చూస్తున్న సామాన్య ప్రజలు మాత్రం, ముక్కున వేలు వేసుకున్నారు. రోజు రోజుకీ రాజకీయం దిగజారిపోతుంటే, కొత్తగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు, ఎప్పటికంటే, ఇంకా దారుణంగా ప్రవరిస్తుంటే, ప్రజలు బాధపడటం తప్ప ఏమి చెయ్యలేరు. ఈ రోజు స్పీకర్ తమ్మినేని సీతారం శ్రీకాకుళం జిల్లలో పర్యటించారు. ప్రభుత్వం కొత్తగా ఎంపిక చేసిన గ్రామ వాలంటీర్ల సమావేశంలో మాట్లాడుతూ, అదేదో వైసీపీ కార్యక్రమం అయినట్టు, తెలుగుదేశం పై విమర్శలు గుప్పించారు.

tammineni 12082019 3

నిజానికి గ్రామ వాలంటీర్లు ప్రభుత్వ వ్యవస్థ, కాని వీరు దాన్ని వైసిపీ పార్టీ అనుబంధ సంస్థగా చూస్తున్నారు. ఆయన మాట్లాడుతూ, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ పై టీడీపీ కౌన్‌ కిస్కా గొట్టంగాళ్లు పిటీషన్లు వేస్తారు, అవి మేము చూసుకుంటాం, మీరు దాని గురించి ఆలోచించకండి అంటూ, అక్కడ ఉన్న గ్రామ వాలంటీర్లకు హిత భోధ చేసారు.నేను స్పీకర్ కంటే ముందు ఎమ్మెల్యేను అంటూ, బ్యాలెన్స్ తప్పి మాట్లాడారు. స్పీకర్‌గా తనకు విశేష అధికారాలు ఉన్నాయని, తనపై కారుకూతలు కూసే వాళ్లు ఈ విషయాన్ని తెలుసుకోవాలని స్పీకర్ తమ్మినేని తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. అయితే, ఈ వ్యాఖ్యల పై, ఎలా స్పందించాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. నా ఇష్టం అంటూ, ఒక స్పీకర్ స్థాయిలో వ్యక్తి ఇలా మాట్లాడితే, ఇక పరిస్థితులు ఎలా ఉంటాయో మన ఊహకే...

Advertisements

Advertisements

Latest Articles

Most Read