పారిశ్రామకవేత్తలు, అందునా బిజినెస్ టైకూన్ లాగా పేరు ఉన్న టాటాలు, అంబానీలు, రాజకీయ నాయకులతో అంతగా, బహిరంగగా కనిపించటానికి ఇష్టపడరు. దానికి అనేక కారణాలు ఉంటాయి అనుకోండి. కాని చంద్రబాబు విషయంలో మాత్రం అలా కాదు. ఎంత పెద్ద బిజినెస్ టైకూన్ అయినా, చంద్రబాబుకి ఇచ్చే గౌరవం వేరు. అంబానీ లాంటి వాడు, ముంబై నుంచి అమరావతి వచ్చి, చంద్రబాబుతో ఒక పూట ఉన్నారు అంటేనే, ఆయన రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఈ రోజు, బిజినెస్ టైకూన్ రతన్ టాటా, చంద్రబాబుకి పర్సనల్ గా రాసిన లెటర్ చూస్తే, చంద్రబాబు సత్తా ఏంటో తెలుస్తుంది.

cbn letter 04092018 2

ఈ లెటర్ చూస్తే, ఒక మేధావిని ఇంకో మేధావే గుర్తించగలడు అంటారు... ఇది చుస్తే నిజమే అనిపిస్తుంది... అలిపిరిలో టాటా ట్రస్టు ఆధ్వర్యంలో రూ.140 కోట్లతో శ్రీవేంకటేశ్వర క్యాన్సర్‌ వైద్య, విజ్ఞాన సంస్థను ఏర్పాటుకు గత శుక్రవారం శంకుస్థాపనకు, రతన్ టాటా వచ్చారు. ఆ శంకుస్థాపనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యామంత్రి చంద్రబాబు కూడా వెళ్లారు. రతన్ టాటా, ఆంధ్ర రాష్ట్ర ప్రగతిలో ఇస్తున్న తోడ్పాటుకి, చంద్రబాబు తగు గౌరవం ఇచ్చారు. అంతకు ముందు కూడా ముంబై పర్యటనలో, రతన్ టాటా, చంద్రబాబుకి ఇచ్చిన గౌరవం అందరూ చూసారు. ఆయనే స్వయంగా వచ్చి, చంద్రబాబుని తన ఆఫీస్ లోకి తీసుకువెళ్ళారు.

cbn letter 04092018 3

అయితే, నిన్న రతన్ టాటా చంద్రబాబుకి ఒక లేఖ రాసారు. సామాన్యంగా ఇలాంటి పర్యటనలు అక్కడితో అయిపోతుంది. కాని టాటా మాత్రం, చంద్రబాబు ఇచ్చిన గౌరవానికి, ఆయనకు కృతజ్ఞతగా లేఖ రాసారు. మీరు చూపించిన గౌరవానికి ధన్యవాదాలు అని చెప్తూనే, మీతో నాకు కొన్నేళ్ళుగా మంచి అనుబంధం ఉంది. మీరు కూడా నాకు ఎంతో గౌరవం ఇచ్చారు. మీకు, మీ రాష్ట్రానికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా, నేను మీకు సహాయం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా మారటానికి, మీకు సహకారం అందిస్తాను అంటూ ఆయన లేఖ రాసారు. మేటి వ్యాపార దార్శకుడు..మరొక మేటి పరిపాలనా దార్శకుడికి రాసిన ఉత్తరంతో, ఇద్దరూ ఎంతటి ఉన్నతమైన వ్యక్తులో అర్ధమవుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read