ప్రతి రోజు లాగానే ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ, ప్రజా సమస్యల పై ధర్నా చేస్తూ అసెంబ్లీకి వచ్చింది.మొదటి రోజు, ఉల్లిపాయల పెరుగుదల, పంపిణీ పై, రెండు రోజు రైతు సమస్యల పై ధర్నా చేసిన తెలుగుదేశం పార్టీ, ఈ రోజు మీడియా పై ఆంక్షల విషయంలో ధర్నా చేసింది. ధర్నా తరువాత నడుచుకుంటూ, అసెంబ్లీ లోపలకి వస్తున్న తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను, మార్షల్స్ అడ్డుకున్నారు. గత రెండు రోజుల నుంచి ఇదే తంతు కొనసాగుతుంది. ఎమ్మెల్యే చేతిలో ఉన్న ప్లకార్డులు లోపలకు అనుమతించం అంటూ, ఎమ్మెల్యేల వద్ద నుంచి బలవంతంగా లాగేసుకుంటున్నారు. నిన్న ఒక మహిళా ఎమ్మెల్సీ విషయంలో ఇలా చెయ్యటంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే ఇది కాస్తా ఇవాళ మరింత ముదిరింది. ఈ రోజు లోపలకు వస్తున్న టిడిపి ఎమ్మెల్యేలను చీఫ్‌ మార్షల్‌ అడ్డుకున్నారు. బ్యానర్ లు ఇవ్వాలని కోరగా, ఇచ్చేసారు. తరువాత ప్లకార్డులు ఇవ్వాలి అని కోరాగా ఇచ్చారు. అయితే, చివరకు నల్ల బ్యాడ్జీలు కూడా ఇవ్వాలని గొడవ చేసారు.

marshal 12122019 2

ప్రజా స్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉందని, నల్ల బ్యాడ్జీలు కట్టుకుంటే, వచ్చిన ఇబ్బంది ఏమిటి అంటూ, ఆందోళన వ్యక్తం చేసారు. అయినా వాళ్ళు వినక పోవటంతో, చివరకు బ్యాడ్జీలు కూడా ఇచ్చేసారు. అయితే, చంద్రబాబు చేతిలో ఉన్న పేపర్స్ కూడా ఇచ్చేయాలని చీఫ్‌ మార్షల్‌ గొడవ చెయ్యటంతో, చంద్రబాబు ఇక ఉపేక్షించేది లేదు అంటూ, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. పేపర్లు కూడా ఎలా ఇస్తాం అని, ఇవి మా మెటీరియల్ అని, గెట్లు తియ్యాలని కోరారు. అయినా వాళ్ళు మాట వినకపోవటంతో, స్వల్ప తోపులాట జరిగింది. ఈ సమయంలో చంద్రబాబుని, చీఫ్‌ మార్షల్‌ తోసివెయ్యటంతో, టిడిపి ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేసారు. మీ ఇష్టం వచ్చినట్టు ప్రవరిస్తే కుదరదు అని హెచ్చించారు.

marshal 12122019 3

ఈ తతంగం అంతా దాదాపుగా 40 నిమిషాలు పాటు సాగింది. అయితే ఈ విషయం పై చంద్రబాబు అసెంబ్లీలో ప్రస్తావించారు .అసెంబ్లీ గేటు దగ్గర చీఫ్‌ మార్షల్‌ దారుణంగా ప్రవర్తించారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల అనుచితంగా వ్యవహరించారన్నారు. ప్లకార్డులు, బ్యానర్లు, నల్ల రిబ్బన్లు వద్దంటున్నారని, చివరికి కాగితాలు కూడా తీసుకెళ్లనీయడం లేదని బాబు మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలపై చేయి వేసి తోసేశారన్నారు. ఎమ్మెల్యేను అవమానించినవారిని కఠినంగా శిక్షించాలని కోరారు. అయితే దీని పై మంత్రి బుగ్గన మాట్లాడుతూ, చంద్రబాబు ని ఎవరూ తోయ్యలేదని, చంద్రబాబే అందరినీ తోసేసారని, ఎదురు దాడి చేసారు. ఈ విషయం నేను పరిశీలిస్తానని స్పీకర్ చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read