రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, వైసిపీ, తెలుగుదేశం పార్టీ నేతలను ఇబ్బంది పెడుతూ , రాజకీయ దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 500 పైగా దాడులు చేసి, 8 మందిని చంపారని, తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఇదే విషయం పై చంద్రబాబు చలో పల్నాడు కూడా నిర్వహించారు. అయితే, పోలీసులు మాత్రం, ఇవన్నీ అబద్ధం, అంతా కంట్రోల్ లోనే ఉందని చెప్తున్నారు. ఒక పక్క తెలుగుదేశం సానుభూతి పరులు కేసులు పెడుతుంటే, ఆ కేసులు తీసుకోకుండా, తిరిగి వారినే ఇబ్బంది పెడుతున్నారు. ఇవి ఒక్కటే కాదు, సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా రాస్తే చాలు, కేసు పెట్టి, లోపల వేస్తున్నారు. ఇలా ఇవి ఒక్కటే కాదు, పొలాల్లో చెట్లు నరకటం, కాంట్రాక్టు ఉద్యోగాలు పీకియ్యటం, తెలుగుదేశం సానుభూతి పరులు రేషన్ డీలర్లుగా ఉంటే పీకించటం, రోడ్లు తవ్వేయటం, ఇళ్ళకు అడ్డంగా గోడలు కట్టటం, ఇలా అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు.

nhrc 15102019 2

ఇదే విషయం పై చంద్రబాబు కూడా, అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టి, తమ గోడు చెప్పుకున్నారు, పోలీసులను హెచ్చరించారు. అయినా మార్పు లేదు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన పోలీసులే, తమకు అండగా నిలబడటం లేదని ఆరోపిస్తున్నారు. ఇలా అటు ప్రభుత్వ వేధింపులు, ఇటు రక్షించాల్సిన పోలీసులు, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించటంతో, తెలుగుదేశం పార్టీ న్యాయ పరంగా వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా, ముందుగా, జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలవాలని నిర్ణయం తీసుకుని, ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎంపీల బృందం ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిసింది. వారిని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని వివరించారు.

nhrc 15102019 3

జాతీయ మానవ హక్కుల సంఘానికి 11 పేజీల లేఖ ఇచ్చారు. ఎన్ హెచ్ ఆర్సీని కలిసిన వారిలో టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్, రామ్మోహన్ నాయుడు, సీతారామలక్ష్మిలు ఉన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై రాజకీయ దాడులు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని వారు ఫిర్యాదు చేశారు. మా మోర ఆలకించిన జాతీయ మానవ హక్కుల సంఘం, స్పెషల్ టీమ్స్ ని, ఆంధ్రపదేశ్ పంపి, నిజానిజాలు తెలుసుకుని, తగు చర్యలు తీసుకుంటామని, హామీ ఇచ్చారని, ఎంపీలు అన్నారు. తొందరలోనే, జాతీయ మానవ హక్కుల సంఘం టీమ్స్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన, మేము ఇచ్చిన ఫిర్యాదు పై, నిజ నిర్ధారణ చేస్తారని, తెలుగుదేశం ఎంపీలు తెలిపారు. కమీషనర్ మేము చెప్పినవి అన్నీ విన్నారని, మాకు అండగా ఉంటామని హామీ ఇచ్చారని చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read