అసెంబ్లీ సమావేశాల్ మూడో రోజు కూడా గందరగోళం మధ్యే సాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మేల్యేలు, అమరావతి పై మాకు పూర్తిగా మాట్లాడే అవకాసం ఇవ్వకుండా సస్పెండ్ చేసారని, తమకు మాట్లాడే అవకాసం ఇవ్వాలి అంటూ, స్పీకర్ పోడియుం వద్ద నినాదాలు చేసారు. జై అమరావతి, జై జై అమరావతి అంటూ, నినాదాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ సమయంలో స్పీకర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. నిన్న కూడా జై అమరావతి అంటూ నినాదాలు చేస్తుంటే, స్పీకర్ అసహానంతో, నేను నిరసన వ్యక్తం చేస్తూ వెళ్ళిపోతున్నాను అంటూ వెళ్ళిపోయారు. అయితే ఈ రోజు కూడా స్పీకర్ అసహనంతో, టిడిపి సభ్యులను వారించారు. అయినా టిడిపి సభ్యులు వెనక్కు తగ్గలేదు. ఈ సందర్భంలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ పై, చంద్రబాబు నాయుడు పై తీవ్ర అభ్యంతర వ్యాఖ్యలు చేసారు. అమరావతి అంటూ చంద్రబాబు రోడ్ల మీద తిరిగి అడుక్కుంటూ, డ్రామాలు ఆడుతున్నారని, ఆ డబ్బు అంతా కొట్టేస్తారని, చందాలకు అలవాటు పడి, ఇలా అడుక్కుంటున్నారు అంటూ నాని అన్నారు.

jagan 22012020 2

అలాగే మొన్న సస్పెండ్ చేసిన సందర్భంలో చంద్రబాబు, మెట్ల మీద కుర్చుని, మెడలో నల్ల కండువా వేసుకున్నారని, అప్పుడు ఆ మార్షల్స్ కి, కొంత చిల్లర ఉంటే పడేయండి, పోతాడు అని చెప్పమని, హేళనగా నాని మాట్లాడారు. ఇదే సందర్భంలో, నాని మాట్లాడుతూ ఉండగానే, జగన్ మోహన్ రెడ్డి సభలోకి వచ్చారు. దీంతో నాని మాటలకు కౌంటర్ గా, ‘ప్రతి శుక్రవారం కోర్టుకెళ్లాలి.. ప్రతి శుక్రవారం కోర్టుకెళ్లాలి’ అంటూ నినాదాలు చేసారు. దీంతో అడిగి మరీ తన్నించుకోవటం అంటే ఇదే అనుకున్నారో ఏమో కాని, వెంటనే తేరుకుని, వైసీపీ సభ్యులు అందరూ, టిడిపి ఎమ్మెల్యేల వద్దకు దూసుకోచ్చారు. దీంతో స్పీకర్, ఇక పోయి కోర్చోండి, చల్, చల్ అంటూ వ్యాఖ్యలు చేసారు. అయితే స్పీకర్ మాట్లాడే సందర్భంలో కూడా వాయిస్ కట్ అవ్వటం గమనార్హం.

jagan 22012020 3

అయితే ఈ తతంగం అంతా చూస్తున్న జగన్, తనను "ప్రతి శుక్రవారం కోర్టుకెళ్లాలి" అంటూ నినాదాలు చెయ్యటంతో, ఆగ్రహంతో ఊగిపోయారు. తెలుగుదేశం సభ్యులు పది మంది కూడా లేరు, మేము 150 మంది ఉన్నాం, తమను రెచ్చగొడుతున్నారు, తమ చేత తన్నించుకుని, సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు, అసలు పోడియం వద్దకు వెళ్ళటం ఏమిటి, వీళ్ళు వీధి రౌడీలు, వీరిని వెంటనే మార్షల్స్ ను పిలిపించి, వారిని కిందకు దించండి, మాట వినకపోతే, ఎత్తి బయట పడేయండి అంటూ వ్యాఖ్యలు చేసారు. అయితే జగన్ చెప్పినట్టే స్పీకర్, మార్షల్స్ ని పిలిచి, టిడిపి ఎమ్మెల్యేలని, వారి స్థానల్లో కూర్చో పెట్టాలని కోరగా, నిమ్మకాయల చిన రాజప్పని ఎత్తి, అసెంబ్లీ బయటకు తీసుకు వెళ్ళటంతో అందరూ ఆశ్చర్య పోయారు. సస్పెండ్ చెయ్యకుండా ఎలా బయటకు పంపిస్తారు అంటూ అందోళన వ్యక్తం చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read