పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి పొన్నూరువస్తాదు లెవల్లో తిరుపతిలో వైసీపీ ఓడిపోతే వారిపార్టీఎంపీలతో రాజీనా మా చేయిస్తామని, టీడీపీఓడితే, చంద్రబాబు తనపార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తారా అని సవాల్ విసిరాడ ని టీడీపీనేత, తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఆదివారం ఆయన మంగ ళగిరిలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడా రు. ఇప్పుడు సవాళ్లు విసురుతున్న పెద్దిరెడ్డికి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎప్పుడో సవాల్ విసిరాడని, దానిపై ఆయనింతవరకు స్పందించలేదన్నారు. వైసీపీప్రభుత్వం రాష్ట్రంలో చేశామని చెప్పుకుంటున్న అభివృద్ధి, సంక్షేమాలపై పాలకులకు నమ్మకముంటే, మూడురాజ ధానులకు రాష్ట్రప్రజల మద్ధతుందని భావి స్తే, చంద్రబాబు విసిరిన సవాల్ ను, పెద్దిరెడ్డిగానీ, ముఖ్యమంత్రి గానీ స్వీకరించాలన్నారు. చంద్రబాబు నాయుడు విసిరిన సవాల్ పెద్దిరెడ్డికి గుర్తులేకపోతే తాము గుర్తుచేస్తామన్నారు. మూడురాజధానులకు ప్రజలమద్ధతుందని భావిస్తే, తక్షణమే ప్రభుత్వాన్ని రద్దు చేసిఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబునాయుడు స వాల్ విసరడం జరిగిందన్నారు. టీడీపీ అధినేత సవాల్ పై పెద్దిరెడ్డి స్పందించి, ప్రభుత్వాన్ని రద్దుచేసి, తిరిగి ఎన్నికల్లో గెలవగలిగితే టీడీపీ ఎక్కడా వైసీపీకి అడ్డురా దని మర్రెడ్డి స్పష్టంచేశారు. దమ్ము, ధైర్యం పెద్దిరెడ్డికి ఉం టే, చంద్రబాబునాయుడి సవాల్ ని స్వీకరించాలన్నారు. తిరుపతిలో వైసీపీఎంపీగెలిస్తే, రాష్ట్రానికి ఒరిగేదేమిటో పెద్దిరెడ్డి చెప్పాలన్నారు. 22మందిఉన్నా, 23మంది ఉన్నా, ఎంపీలుగా పార్లమెంట్ లో వారు రాష్ట్రానికి రావా ల్సినవాటిని ఏంసాధించారో చెప్పాలన్నారు. ప్రత్యేకహో దా అడగడానికి మోదీకి పూర్తిమెజారిటీ ఉందికాబట్టి అడగలేకపోతున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టుని పూర్తిచేయడానికి కావాల్సిన నిధులు అడగమంటే, దా నిపై గతంలో వైసీపీచేసిన దుష్ప్రచారాలే ఇప్పుడు వారి మెడకు చుట్టుకున్నాయన్నారు. రెండోవైపున 2019 లోజరిగినఎన్నికల ప్రక్రియలో పక్కరాష్ట్రం నుంచి కేసీఆ ర్, వైసీపీకి సపోర్ట్ చేశాడుకాబట్టి, పోలవరం ఎత్తు తగ్గిం చడానికి ఈముఖ్యమంత్రి సిద్ధమయ్యాడన్నారు.

జగన్మో హన్ రెడ్డికి కేసీఆర్ తో ఒప్పందం ఉందికాబట్టి, తెలంగా ణ నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఆస్తులను వదిలేయడం జరిగిందన్నారు. ఆంధ్రుల హక్కైన విశాఖ ఉక్కుని ప్రైవే టీకరిస్తున్నా, పోస్కోకంపెనీ ప్రతినిధులతో ముఖ్యమం త్రే స్వయంగా చర్చలు జరిపాడు కాబట్టి, విశాఖఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోలేని దుస్థితిలోఉన్నాడన్నారు. ఈ విధంగా అనేకఅంశాల్లో విఫలమైన వైసీపీప్రభుత్వానికి మరో ఎంపీని గెలిపిస్తే రాష్ట్రానికి ఏం ఒరుగుతుందనే ఆలోచనలో తిరుపతి పార్లమెంట్ ప్రజలు ఉన్నారని శ్రీని వాసరెడ్డి తెలిపారు. తిరుపతి పార్లమెంట్ ఓటర్లు, వైసీపీ ఎంపీలు ఇప్పటివరకు రాష్ట్రానికి ఏంచేశారు..కొత్తగా గెలి చే ఆయన ఏంచేస్తాడనే ఆలోచిస్తున్నారన్నారు. తిరుప తిపార్లమెంట్ ఎన్నికలో వైసీపీఅభ్యర్థిని గెలిపించాల్సిన అవసరంలేదని స్థానికఓటర్లు ఇప్పటికే ఒకనిర్ణయానికి వచ్చారన్నారు. దాంతో ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను, రౌడీలు-పోలీసుల మైత్రిని, రెవెన్యూవ్యవస్థను ఉపయో గించుకొని ఉపఎన్నికలో గెలవడానికి ప్రయత్నిస్తోంద న్నారు. గెలుపుకోసంహీనస్థితికి దిగజారిన వైసీపీ, టీడీపీకి సవాల్ విసరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉమ్మడిరాష్ట్రంలో, రాష్ట్రవిభజనానంతరం 22ఏళ్లపాటు రాష్ట్రాన్నిపాలించిన తెలుగుదేశంపార్టీకి పిల్లకాకి వైసీపీ సవాల్ విసురుతోందన్నారు. రాష్ట్రం విడిపోయాక కూడా రాష్ట్రంలోని అన్నివర్గాలకు టీడీపీప్రభుత్వం మేలుచేసిం దన్నారు. టీడీపీప్రభుత్వం రైతులరుణమాఫీకి సంబంధించి ఇచ్చిన జీవోని రద్దుచేసిన వైసీపీ ప్రభుత్వానికి ఎందుకుఓటేయాలో చెప్పాలన్నారు. కేం ద్రంలో అధికారంలోఉన్నపార్టీని నిలదీయలేనివారు, ఎండలు, వానలు వస్తే రైతులనుఆదుకోలేనివారు, మన మేంచేస్తామంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతు న్నారన్నారు.

రైతుభరోసా కేంద్రాల ముసుగులో వైసీపీ నేతలు రైతులను దోచుకుంటున్నా, వారే దళారుల అవ తారమెత్తి రైతులఉత్పత్తులను తక్కువధరకు కొంటు న్నా ఈ ప్రభుత్వం ఏమీచేయలేకపోయిందన్నారు. పిచ్చిసారాయిని, నాణ్యమైన ఇసుకను ఆదాయం కోసం అమ్ముకుంటున్న దగాకోరు ప్రభుత్వానికి ధైర్యముంటే, వ్యవస్థలపై నమ్మకముంటే, చంద్రబాబునాయుడి సవా ల్ కు కట్టుబడి తక్షణమే అసెంబ్లీనిరద్దుచేయాలన్నారు. ఆపని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంచేస్తే, వారు విధించే షరతులకు టీడీపీ కట్టుబడి ఉంటుందని మర్రెడ్డి తేల్చి చెప్పారు. వైసీపీనేతలకు, పెద్దిరెడ్డికి నిజంగా దమ్ము , ధైర్యముంటే చంద్రబాబునాయుడి సవాల్ కు కట్టుబడా లన్నారు. సవాల్ పై నిలబడలేనివారు కాలయాపన కోసం పిచ్చిసవాళ్లు చేస్తున్నారన్నారు. టీడీపీ అధినేత సవాల్ కు కట్టుబడితే, వైసీపీకోరుకుంటున్నట్లు 30ఏళ్లు అధికారంలోఉన్నా, వారికి టీడీపీ అడ్డురాదన్నారు. ప్ర భుత్వంలో ఉన్నాకూడా కేంద్రం రాష్ట్రానికి న్యాయంచేయ లేదని భావించి, ఎంపీ, మంత్రిపదవులను వదిలేసుకు న్న చరిత్ర టీడీపీదన్నారు. టీడీపీ వెనకాముందూ ఆలో చించకుండా రాజీనామాలుచేస్తే, రాజీనామాలు చేస్తే ఏమొస్తుందని పదవులను పట్టుకొని వైసీపీనేతలు వేలా డుతున్నారని శ్రీనివాసరెడ్డి ఎద్దేవాచేశారు. సవాళ్లతో ప్రతిపక్షాన్నిఇబ్బందిపెట్టాలని చూస్తే అదివైసీపీప్రభుత్వా నికే నష్టమన్నారు. చంద్రబాబునాయుడి సవాల్ కు తాము కట్టుబడి ఉన్నామనిచెప్పకుండా, ముందు విసి రిన సవాల్ పై స్పందించకుండా, వెనుక సవాళ్లు విసిరితే ఉపయోగం ఉండదన్నారు. పెద్దిరెడ్డికి ధైర్యం ఉంటే, ప్రభుత్వపాలనపై వారికినమ్మకముంటే, తక్షణ మే ఆయన ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రభుత్వాన్ని రద్దు చేయించాలన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read