ఏపీలో రాజకీయాలు హీట్ పెంచుతున్నాయి. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన ఆచరణలోకి తెచ్చేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఇందుకోసం సోమవారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం జరుగబోతోంది. ఆ సమావేశంలో మూడు రాజధానుల నిర్ణయానికి ఆమోదముద్ర వడేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ మరుసటి రోజే శాసనమండలిలోనూ ఆమోదం పొందా లనేది ప్రభుత్వ వ్యూహం. ఇదే సమయంలో ప్రతిపక్ష టిడిపి సైతం ప్రతి వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా తొలిసారిగా సభ్యు లకు విప్ జారీచేసింది. పార్టీ నుంచి దూరమై, అధికార పార్టీకి దగ్గరైన ఇద్దరు ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయాలని నిర్ణయించారు. మండలిలోనూ టిడిపి కీలక భూమిక పోషించనుంది. దీనిపైన పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ ఎమ్మె ల్యేలు, ముఖ్య నేతలతో కీలక నమావేశం ఏర్పాటు చేశారు. రాజధాని తరలింపు అంశాన్ని ప్రతిపక్ష టిడిపి మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. టిడిపి అధినేత చంద్రబాబు అమరావతికి మద్దతుగా పర్యటనలు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగునున్న నేపథ్యంలో ఆదివారం పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేశారు.

whip 19012019 2

ప్రభుత్వం సభలో సీఆర్డీఏ బిల్లు సవరణ లేదా రద్దు, మూడు రాజధానుల అంశంపై తీర్మానం వంటివాటిల్లో ఏరూపంలో సభ ముందుకు ప్రతిపాదనలు తీసుకొచ్చే అవకాశ ముందనే దానిపై టిడిపి ఇప్పుడు దృష్టి సారిం చింది. ఏరూపంలోనైనా బిల్లు సభలోకి ప్రవేశ పెడితే ఎలా ఎదుర్కోవాలనేదే టిడిపి వ్యూహాత్మ కంగా ఎత్తులు వేస్తోంది. అందులో భాగంగా పార్టీ ఎమ్మెల్యేలు, శాసన మండలినభ్యులకు పార్టీ విప్ జారీ చేసింది. పార్టీ నుంచి గెలిచిన 23 మంది శాసనసభ్యులు తప్పనిసరిగా అసెంబ్లీకి హాజరు కావాలంటూ టిడిపి విప్ జారీ చేసింది. అందులో వల్లభనేని వంశీ, మద్దాళి గిరికి సైతం పార్టీ విప్ జారీ చేసింది. వారికి పార్టీ నుంచి అధికారిక సమావేశం వంపారు. వారి వ్యక్తిగత మెయిలకు సందేశం, ఫోన్‌కు మెసేజ్ తోపాటుగా వాట్సప్-టెలిగ్రామ్ సందేశాలను సైతం అందిస్తున్నారు. వారిద్దరు ఇప్పటికీ అసెంబ్లీ రికార్డుల ప్రకారం టీడీపీ సభ్యులుగానే ఉన్నారు. టీడీపీ విప్ జారీ చేయడం ద్వారా వీరిద్దరు విప్ ఉల్లంఘిస్తే దానిని వారిమీద చర్యలు తీసుకునే విధంగా వ్యూహం సిద్ధం చేసింది.

whip 19012019 3

సీఆర్డీఏ చట్ట సవరణ, అమరావతికి చట్టబద్ధంగా ఉన్న హక్కులు, ప్రభుత్వ ప్రతిపాదనలపై న్యాయ పరంగా సాంకేతికంగా ఏరకంగా ఎదుర్కోవాలనే దానిపై న్యాయ నిపుణుల సలహాలు సైతం టిడిపి సేకరిస్తోంది. శాసనసభలో తమకు బలం లేదని తెల్సి నా రాజధాని విషయంలో డివిజనక్కు పట్టుబట్టి ఆ ఇద్దరూ రెబల్స్ వ్యతిరేకంగా వ్యవ హరిస్తే వారిపై చర్యలకు తమకు అవకాశం దక్కుతుందని టీడీపీ అంచానా వేస్తోంది. ఇదే సమయంలో విశాఖ నుంచి ఎన్నికైన నలుగురు ఎమ్మెల్యేల పాత్ర ఏంటనేది కీలకంగా మారనుంది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో మండలి సభ్యుల పాత్ర కీలకం కానుంది. శాసనమండలిలో మొత్తం 58 మంది సభ్యులుండగా, అందులో టిడిపి 28, పిడిఎఫ్ 5, వైఎస్సార్సీ 9, ఇండిపెండెంట్ 3, నామినేటెడ్ 8, బిజెపి 2గా ఉన్నాయి. ఇవిగాక మరో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం ఏరూపంలో మూడు రాజధానుల అంశంపై శాసనసభ ముందుకొచ్చినా అనుకూలంగా ఫలితం సాధించేందుకు అధికార వైసీపీకి శాసనసభలో పూర్తి మెజార్టీ ఉంది. శాసనసభలో ప్రభుత్వం ప్రతిపాదించే బిల్లు లేదా తీర్మానం ఆమోదం పొందిన తర్వాత మండలిలోనూ చర్చకురానుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read