తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని వైజాగ్ లో అరెస్ట్‌ చేయటం పై, తెలుగుదేశం సంచలన నిర్ణయం తీసుకుంది. హుటాహుటిన, హైకోర్టులో టీడీపీ హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. పోలీసులు ముందుగా, చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇచ్చారని, మళ్లీ దాన్ని రద్దు చేసి, అరెస్ట్ చెయ్యటం పై అభ్యంతరం వ్యక్తం చేసింది. చంద్రబాబు వైజాగ్ పర్యటన కొనసాగించేలా చూడాలి అంటూ, టీడీపీ హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ వేసింది. ఈ రోజు ఉదయం నుంచి దాదాపు 5 గంటలపాటు విశాఖ విమానాశ్రయంలోనే ఉన్న తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. సెక్షన్‌ 151 కింద నోటీసులు ఇచ్చిన పోలీసులు, చంద్రబాబుని ముందస్తు అరెస్టు చేస్తున్నట్లు చెప్పారు. భద్రత కారణాల దృష్ట్యా ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత భారీ భద్రత మధ్య చంద్రబాబును విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లోకి తీసుకెళ్లారు. అరగంట పాటు అక్కడ ఉంచడానికి ఏర్పాట్లు చేశారు.

విశాఖ పర్యటనకు వస్తే, తమపై దారుణంగా ప్రవరిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యటనకు అనుమతి తీసుకున్నామని గుర్తు చేశారు. విశాఖ పర్యటనలో తమపై వైకాపా శ్రేణులు దాడి చేశారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. గంట, రెండు గంటలు ఆగితే పంపిస్తామని పోలీసులు చెప్పారని... ఇప్పుడేమో వెనక్కి వెళ్లాలని చెబుతున్నారని పేర్కొన్నారు. ఏ చట్టం కింద వెనక్కి వెళ్లాలని చెబుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. తాను చట్టాన్ని ఉల్లంఘించనని.. పూర్తిగా సహకరిస్తానని అన్నారు. న్యాయపరంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. విశాఖలో భూకబ్జాలు జరిగాయన్న చంద్రబాబు.. నిజమో? కాదో? ప్రజలే తేలుస్తారన్నారు. మేము వస్తుంటే, ఎందుకు అంత భయం అని చంద్రబాబు ప్రశ్నించారు.

చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనపై వైసీపీ నేతలు ఎందుకంత ఉలికిపాటుకు గురవుతున్నారని, ఆయన ప్రజల్లోకి వెళుతుంటే, ఆంక్షలు, అనుమతులతో అడ్డుకోవడం ఏంటని టీడీపీ సీనియర్ నేత, మాజీ విప్ కూనరవికుమార్ నిలదీశారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటున్న తీరుపై డీజీపీ సమాధానం చెప్పాలన్నారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అనుసరిస్తున్న తీరునే, గతంలో చంద్రబాబు అనుసరించి ఉంటే, జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రను ఒక్క అంగుళమైనా చేయగలిగి ఉండేవాడా అని రవికుమార్ ప్రశ్నించారు. కేసుల నుంచి బయటపడటం కోసం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్రంతో లాలూచీపడిన జగన్, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఢిల్లీ వారితో దాగుడుమూతలు ఆడాడన్నారు. మతికోల్పోయి మాట్లాడుతున్న బొత్స, తన వ్యవహారాలు చంద్రదబాబు బయటపెడతాడన్న భయంతోనే ఆయనకు గోబ్యాక్ చెబుతానంటున్నాడని రవికుమార్ తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read