గన్నవరం ఎమ్మేల్యే వల్లభనేని వంశీ పై, తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. వల్లభనేని వంశీ గత రెండు నెలలుగా వార్తలో ఉంటున్నారు. దీపావళి పండుగకు ముందు, వంశీ పై, అక్రమ పట్టాలు ఇచ్చారు అంటూ, పోలీస్ కేసు పెట్టటం, వైసీపీ నన్ను వేధిస్తుంది అంటూ వంశీ చెప్పటం, వారం రోజులకే జగన్ మోహన్ రెడ్డిని కలవటం, తరువాత వాట్స్ అప్ లో చంద్రబాబుకి లేఖ రాసి, తన పై వేధింపులు ఎక్కువ అయ్యాయని, అందుకే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా అని చెప్పటం, మళ్ళీ ఒక నెల రోజులకి, చంద్రబాబు పై విరుచుకు పడుతూ ప్రెస్ మీట్ పెట్టటం తెలిసిందే. అయితే, చంద్రబాబు పై ఇష్టం వచ్చినట్టు పరుష పద జాలంతో మాట్లాడటంతో, తెలుగుదేశం పార్టీ వల్లభనేని వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేసి, షోకాజ్ నోటీసు ఇచ్చింది. గతంలో 2007లో కూడా ఒకసారి ఇలాగే వంశీకి షోకాజ్ నోటీస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావటంతో, వంశీ పై ఆసక్తి నెలకొంది.

vamsi 09122019 2

అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం, వంశీ విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. వంశీ పై ఎలా అయినా అనర్హత వేటు వేసే ప్లాన్ లో, తన వైపు నుంచి ఏ తప్పు లేకుండా అడుగులు వేస్తుంది. ముందుగా వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేసినా, ఆ విషయాన్ని అధికారికంగా స్పీకర్ కార్యాలయానికి చెప్పలేదు. దీంతో, వంశీకి స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉండే అవకాసం పోయింది. ఆయన టెక్నికల్ గా తెలుగుదేశం ఎమ్మెల్యేగానే ఉన్నారు. అయితే తాము సస్పెండ్ మాత్రమే చేసామని, బర్తరఫ్ చేస్తేనే వంశీకి స్వతంత్ర ఎమ్మల్యేగా ఉండే అవకాసం ఉంటుందని టిడిపి వాదిస్తుంది. అయితే మరో పక్క, ఈ రోజు వంశీ టిడిపి కూర్చునే స్థానాల్లోనే కూర్చున్నారు. టిడిపి ఎమ్మెల్యేల వెనుక విడిగా కూర్చున్నారు.

vamsi 09122019 3

ఇక మరో పక్క, తెలుగుదేశం పార్టీ ఈ రోజు జరిగే తెలుగుదేశం పార్టీ ఎమ్మేల్యేలతో చంద్రబాబు అధ్యక్షతన మీటింగ్ పెట్టుకుంది. దీనికి రావాల్సిందిగా పార్టీ నుండి వంశీకి ఆహ్వానం వచ్చింది. అయితే వంశీ మాత్రం రాలేదు. కాని ఇక్కడ తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మికంగా తన తప్పు లేకుండా, వంశీకి అవకాసం ఇవ్వకుండా, ప్రతి టెక్నికల్ అంశంలో జాగ్రత్తగా వెళ్తుంది. ఈ నేపధ్యంలో వంశీ పై అనర్హత వేటు వెయ్యటానికి, ఈ అసెంబ్లీ సమావేశాల్లో, తెలుగుదేశం పార్టీ ఒక విప్ ఇవ్వనుంది. ఈ విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేల పై, అప్పుడు అనర్హత వేటు వెయ్యమని స్పీకర్ ను కోరనుంది. ఈ విధంగా, వంశీ ఎపిసోడ్ లో, పై చేయి సాధించాలని తెలుగుదేశం పార్టీ చూస్తుంది. మరి అటు వైపు నుంచి ఎలా వ్యూహాలు ఉంటాయో చూడాలి మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read