మున్సిపల్ ఎన్నికల్లో ఎన్ఆర్ఐలు ఓటు వేసే ముందు ఆలోచించుకోవాలి. 21 నెలల్లో జగన్ రెడ్డి జె. ట్యాక్స్ కోసం ఎన్ఆర్ఐ లను అన్ని విధాలా వేధించారు. హ్యాపీ నెస్ట్ ఆపేసి ఎన్ఆర్ఐలకు ఇబ్బందులకు గురి చేశారు. ఏపీలో ఎన్ఆర్ఐ ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. జె.ట్యాక్స్ కు భయపడి ఏపీలో పెట్టుబడులు పెట్టడం లేదు. మీరేసే ఓటుతో జగన్ రెడ్డికి బుద్ధి రావాలి. ప్రవాసాంధ్రులను పరాయి బిడ్డలుగా చూస్తున్నారు. రాష్ట్రాభివృద్ధికి ముందుకొస్తున్న ఎన్ఆర్ఐల దగ్గర జె ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. రాష్ట్రానికి చెందిన ఎన్ఆర్ఐల (విదేశాల్లో నివసించే తెలుగువారు) సేవలను, వారితెలివితేటలను రాష్ట్రాభివృద్ధికి వినియోగించు కోవడంలో జగన్ సర్కారు ఘోరంగా విఫలమైందని టీడీపీ రాష్ట్రకార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరామ్ ప్రసాద్ స్పష్టంచేశారు. ఆదివారం ఆయన మంగళగిరిలోనిపార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని పరిస్థితులు, ప్రభుత్వ వ్యవ హారాలుచూస్తుంటే తెలుగువాడిగా తనకు బాధ కలుగుతోందన్న ప్రసాద్, దేశవిదేశాల్లోతెలుగువారు ఉన్నతస్థానాల్లో ఉన్నారంటే, అందుకుకారణం వారికృషి,పట్టుదల, తెలివితేటలేనన్నారు. సామా జిక, ఆర్థిక, వైద్య, విద్యారంగాల్లో దేశంఅభివృద్ధి సాధించడానికి ఎన్ ఆర్ఐల సహాకారంకూడా ఉందన్నారు. వైసీపీప్రభుత్వం ఏర్పడిన తర్వాత విదేశాలనుంచి రాష్ట్రానికి రూపాయిపెట్టుబడికూడా రాలేద న్నారు. గతప్రభుత్వం ఎంతోప్రతిష్టాత్మకంగా అమలుచేసిన హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ ఎన్ఆర్ఐల సహాకారంతో విజయవంతమైందన్నారు. నేడు ఈప్రభుత్వంలో ఆప్రాజెక్ట్ ఎక్కడుందో కూడా తెలియడంలేద న్నారు. విశాఖ, విజయవాడ, మంగళగిరి, తిరుపతిలో గతప్రభు త్వంలో అనేక ఐటీసంస్థలు నెలకొల్పడం జరిగిందని, నాటి ఐటీ శాఖామంత్రి నారాలోకేశ్ చొరవతో, ఐటీరంగం రాష్ట్రంలో పుంజుకుంద న్నారు.

నేడు మేథాటవర్స్ లోని ఐటీకంపెనీలు, మంగళగిరి సమీ పంలోని ఏపీఎన్ఆర్టీ టెక్ పార్క్ వంటివన్నీ బోసిపోయాయన్నారు. ఈ ప్రభుత్వం, మంత్రుల నిర్వాకం కారణంగా ఏపీఎన్ఆర్టీ టెక్ పార్క్, మేథాటవర్స్ శ్మశానాన్ని తలపిస్తున్నాయని రామ్ ప్రసాద్ వాపోయారు. హెచ్ పీసీఎల్, రిలయన్స్, అదానీ డేటాసెంటర్ వంటివన్నీ ఎక్కడికిపోయాయో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది శూన్యంగా మారిందన్న టీడీపీనేత, ఐటీకంపెనీలకు ఇవ్వాల్సిన రాయితీలు, ప్రోత్సాహకాలను జగన్ ప్రభుత్వం నిలిపివేయడంవల్లే, ఐటీరంగం రాష్ట్రాన్ని వీడిపోయే పరిస్థితి తలెత్తిందన్నారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇంజనీరింగ్ కాలేజీలుఏర్పాటుచేసి, ఏటా ఇబ్బడి ముబ్బడిగా పట్టాలుతీసుకొని బయటకువచ్చే విద్యార్థులకోసం, ఐటీరంగాన్ని అభివృద్దిచేయడం జరిగిందన్నారు. హైటెక్ సిటీ రూప కల్పనతో నాటిఉమ్మడిరాష్ట్రాన్ని చంద్రబాబునాయుడు ఇన్ ఫర్మే షన్ టెక్నాలజీకి కేంద్రబిందువుగా మార్చారన్నారు. చంద్రబాబు హాయాంలో హైదరాబాద్ లోని అమీర్ పేటప్రాంతం, 24గంటలు ఐటీ విద్యార్థులకోసం పనిచేసే నైపుణ్యకేంద్రంగా విరాజిల్లిందన్నారు. కొన్ని లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పించిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. నేడు హైదరాబాద్ మహానగరంగా మారడానికి చంద్రబాబునాయుడుగారి విజనే కారణమన్నారు.

రాష్ట్రం విడిపో యాక, ఏపీని ఎలా అభివృద్ధిచేయాలన్న ఆలోచనతో, మరలా చంద్రబాబునాయుడే ఐటీ కంపెనీలను విరివిగా ప్రోత్సహించారన్నా రు. లోకేశ్ నాయకత్వంలో, మంగళగిరి కేంద్రంగా దాదాపు 36 ఐటీ కంపెనీలు వాటి కార్యకలాపాలు సాగించాయన్నారు. నేడు ఆ కంపె నీలన్నీ తట్టాబుట్టా సర్దేసుకునే పరిస్థితులు రావడానికి, జగన్ ప్రభుత్వ నిర్వాకమే కారణమని బుచ్చిరామ్ ప్రసాద్ మండిపడ్డారు. కంపెనీలుపెట్టిన ఎన్ఆర్ఐలంతా తిరిగి హైదరాబాద్ బాటపట్టారని, వారంతా తమపెట్టుబడులను తెలంగాణలోపెట్టడానికే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. చంద్రబాబుప్రభుత్వం దాదాపు ప్రజలకోసం 119 వరకుసంక్షేమపథకాలు అమలుచేస్తే, జగన్మోహన్ రెడ్డి మాత్రం నవ రత్నాలపేరుతో ప్రజలనుదారుణంగా వంచిస్తున్నాడన్నారు. అటు అభివృద్ధిలేక, ఇటుసంక్షేమం అమలుకాక, రాష్ట్రం అన్నివిధాలా నష్టపోతోందన్నారు. ఎన్ఆర్ఐలు, ఐటీరంగనిపుణులు, విదేశాల్లో నివసించే తెలుగువారు, వారిని ఆదర్శంగా తీసుకొని విద్యాభ్యాసం చేస్తున్న తెలుగురాష్ట్రాల విధ్యార్థులు తెలుగుదేశానికి ఎందుకు ఓటే యాలో ఇప్పటికైనా ఆలోచనచేస్తే మంచిదని టీడీపీనేత హితవు పలికారు. ఎన్ఆర్ఐలు, ఉన్నతవిద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థినీ, విద్యార్థులు తమఓటును మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకే వేయాలని రామ్ ప్రసాద్ తేల్చిచెప్పారు.తక్కువ రాజకీయప్రమేయంతో, ప్రజా రంజకమైన పాలన సాగించేఏకైక పార్టీ టీడీపీ ఒక్కటేననే వాస్తవా న్ని ప్రతిఒక్కరూ గ్రహించాలన్నారు. తెలుగుదేశంపార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ఎన్ఆర్ఐలు, విద్యార్థులు, యువతంతా తమ వంతు సహాయసహకారాలు అందించాలని టీడీపీనేత, రామ్ ప్రసాద్ విజ్ఞప్తిచేశారు

Advertisements

Advertisements

Latest Articles

Most Read