అత్యున్నతస్థానమైన స్పీకర్‌పదవిని, రాజకీయఅవసరాలకు వాడుకుంటున్న వైసీపీ ప్రభుత్వం, ప్రతిపక్షంపై బురదజల్లాలని చూస్తోందని టీడీపీ సీనియర్‌నేత, మాజీమంత్రి నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం ఆయన గుంటూరులోని పార్టీ రాష్ట్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పార్టీకార్యక్రమంలో పాల్గొన్న తమ్మినేని సీతారామ్‌ తాను స్పీకర్‌నన్న విషయంమర్చిపోయి, టీడీపీఅధినేత చంద్రబాబుపై, ఆపార్టీ జాతీయప్రధానకార్యదర్శి నారాలోకేశ్‌పై ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకున్న వైసీపీనేతలు, స్పీకర్‌స్థానాన్ని తెలుగుదేశంపార్టీ అగౌరవపరిచిందని చెప్పడం హాస్యాస్పదం గా ఉందని నక్కా ఎద్దేవాచేశారు. తానువైసీపీశానసభ్యుడినని చెప్పుకుంటూ, స్పీకర్‌ననే విషయం మర్చిపోయి మాట్లాడిన తమ్మినేనిని వెనకేసుకొచ్చేముందు, ఎవరు అనుచితంగా హద్దులుమీరి మాట్లాడారో వైసీపీనేతలు తెలుసుకుంటే మంచిదని ఆయన సూచించారు.

tammineni 11112017 2

స్పీకర్‌స్థానంలో ఉండి, తననుఉద్దేశించి తమ్మినేని చేసిన నిరాధార ఆరోపణలను ఖండిస్తూ, నారా లోకేశ్‌ లేఖరాశారని, సీతారామ్‌చేసిన ఆరోపణలు నిరూపిస్తే, రాజీనామా చేస్తానని, నిరూపించలేకుంటే, తమ్మినేని తమనాయకుడి బట్టలు ఊడదీస్తాడా అని ప్రశ్నించడం జరిగిందన్నారు. తమ్మినేనివ్యాఖ్యలను చంద్రబాబు సహా, తమపార్టీనేతలంతా ఖండించారని, ఆ అంశంపై వైసీపీనేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ, బీసీని స్పీకర్‌చేయడం టీడీపీకి, చంద్రబాబుకి ఇష్టంలేదని చెప్పడం, వారిలోని అజ్ఞానాన్ని తెలియచేస్తోందని మాజీమంత్రి ఎద్దేవాచేశారు. తమ్మినేని సీతారామ్‌ని 5సార్లు ఎమ్మెల్యేని చేసింది, 3సార్లు మంత్రిని చేసింది, తెలుగుదేశమనే విషయం వారు గుర్తించాలన్నారు. బీసీలకు రాజకీయంగా, సామాజికంగా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, వారి ఎదుగుదలకు కారణమైంది తెలుగుదేశం పార్టీయేనని నిజాన్ని కూడా తెలుసుకోలేని దుస్థితిలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులుండటం సిగ్గుచేటని ఆనందబాబు మండిపడ్డారు.

tammineni 11112017 3

స్పీకర్‌స్థానంపై తెలుగుదేశానికి అచంచలమైన విశ్వాసం, గౌరవం ఉన్నాయని, ఆస్థానాన్ని రాజకీయంగా వాడుకుంటూ, బజారుకీడ్చింది ముమ్మాటికీ వైసీపీనేతలేనని ఆయన స్పష్టంచేశారు. టీడీపీ బీసీలకు, దళితులకు ఎంతటిముఖ్యస్థానాలు కట్టబెట్టిందో రాష్ట్రప్రజలందరికీ తెలుసునన్నారు. స్పీకర్‌స్థానంలో ఉండి తమ్మినేని చేసిన వ్యాఖ్యలను ప్రజలంతా ఛీకొట్టినా, ఆయన్ని వైసీపీనేతలు వెనకేసుకు రావడం సిగ్గుచేట న్నారు. తమ్మినేనివ్యాఖ్యలను రాజకీయంచేసి, స్పీకర్‌స్థానాన్ని భ్రష్టు పట్టించవద్దని ఆనందబాబు వైసీపీనేతలకు హితవుపలికారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read