ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశ రాజధాని ఢిల్లీలోనూ సీన్ మారింది. రాష్ట్రంలో అధికా రంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ భవన్లోనూ టిడిపిని బుల్ డోజ్ చేసింది. ఒకప్పుడు తెలుగుదేశంపార్టీకి పార్లమెంట్ భవన్లో అత్యంత ప్రాధాన్యత ఉండగా, ఇప్పుడు ఎక్కువ మంది ఎంపీలు ఉండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హడావిడి చేస్తుంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్ భవన్లో స్థాన చలనం కలిగింది. ఈ లోపు మూడు గండాలు దాటుకొచ్చిన తెలుగుదేశం పార్టీ ఈ సారి తన కార్యాలయన్ని తరలించక తప్పలేదు. పార్లమెంట్ భవన్లో అందరికీ తెలిసిన లోకసభ, రాజ్యసభ, జాయింట్ సెషన్ నిర్వహించేటప్పుడు ఉపయోగించే సెంట్రల్ హాల్ తో పాటు, ప్రధానమంత్రి, కేంద్ర కేబినెట్ మంత్రుల కార్యా లయాలు ఉంటాయి. అలాగే సంఖ్యా బలం ఆధా రంగా రాజకీయ పార్టీలకు కూడా గదులను కేటా యిస్తూ ఉండటం సర్వసాధారణం. పార్లమెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం 41 గదులు ఉండగా, 9, 10వ నెంబర్ గదుల్లో ప్రధాన మంత్రి కా ర్యాలయం, 8వ నెంబర్ గదిలో హోం మంత్రి అమిత్ షా కార్యాలయం ఉన్నాయి.

6, 7వ నెంబర్ గదుల్లో కీలక మంత్రుల కార్యాలయాలు ఉన్నాయి. 2వ నెంబర్ నుండి 4వ నెంబర్ వరకూ భారతీయ జనాతా పార్టీ కార్యాలయం, ఎన్డీయే నేత కార్యాలయాలు ఉన్నాయి. వీటి మధ్యలో 5వ నెంబర్ గదికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అర్థమవుతోంది. అటువంటి ప్రాధాన్యత కలిగిన ఆ గదిలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కార్యాలయంగా కొనసాగింది. ఐదేళ్లు, పదేళ్లు కాకుండా ఏకంగా 3 దశబ్దాల పాటు తెలుగుదేశం పార్టీ కార్యాలయమే ఆ గదిపై అధికారం చెలాయించింది. ఈ విధంగా 1989 సంవత్సరం నుండి ఆ గది తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కార్యాలయంగా ఉండేది. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి కాని, టిడిపి గది మాకే కావాలి అని పట్టుబట్టటంతో ఇప్పుడు ఆ కార్యాలయాన్ని 3వ అంతస్తులోనికి మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3వ అంతస్తులోని 118వ నెంబరకు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కార్యాలయాన్ని తరలించాల్సి వచ్చింది.

పార్లమెంట్ భవన్ లో గదుల కేటాయింపు ఎలా జరుగుతుందోనని పరిశీలిస్తే పార్టీల సంఖ్యా బలం ఆధారంగా పార్లమెంట్ భవనంలోని గదులను లోక్ సభ స్పీకర్ రాజకీయ పార్టీల పార్లమెంట్ రీ కార్యా లయాలను కేటాయిస్తుంటారు. ఎక్కువ మంది ఎంపీలు కలిగిన రాజకీయ పార్టీలకు ప్రధాన మంత్రి, కేబినెట్ మంత్రుల కార్యాలయాలు ఉండే గ్రౌండ్ ఫ్లోర్లో గదులు లభిస్తాయి. మిగిలిన పార్టీలకు 3వ అంతస్తులోని గదులను కేటాయించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలు గుదేశం పార్టీకి 1989లో నాటి పార్టీ ఎంపీల సంఖ్యా బలం ఆధారంగా పార్లమెంట్ భవన్లోని గ్రౌండ్ ఫ్లోర్ 5వ నెంబర్ గదిని కేటాయించారు. 1989 తర్వాత పార్టీ సంఖ్యా బలం తగ్గిన 3 సందర్భాల్లో ఆ గదిని టీఎంసీ, డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలకు కేటాయించారు. అయితే ఏ సందర్భంలోనూ తెలుగుదేశం పార్టీ మాత్రం తమ కార్యాలయాన్ని ఖాళీ చేయకుండా నాటి స్పీకర్లతో మాట్లాడి 5వ నెంబర్ గదిలోనే ఉండిపోయింది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుల సంఖ్య లోకసభ, రాజ్య సభల్లో కలిపి 5 గురితో ఉంది.

దీంతో స్పీకర్ 5వ నెంబర్ గదిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ సభ్యులకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తెలుగుదేశం పార్లమెంటరీ సభ్యులకు 3వ అంతస్తులోని రూమ్ నెంబర్ 118 కేటాయించారు. అయితే 17వ లోకసభ ఏర్పాటు అయిన తర్వాత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు కూడా జరిగాయి. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ ఆ 5వ నెంబర్ గదిని ఖాళీ చేయకపోవడంతో విజయసాయి రెడ్డి, బయటి శక్తుల ద్వారా ఒత్తిడి తీసుకొస్తూ ఆ గదిని ఖాళీ చేయకుండా తెలుగుదేశం పార్టీ కొనసాగుతోందని ఆరోపిస్తూ ఒక లేఖను స్పీకర్ కు రాశారు. దీంతో స్పీకర్ వెంటనే స్పందిస్తూ పార్లమెంట్ భవన్ గ్రౌండ్ ఫ్లోర్లోని 5వ నెంబర్ గదిని ఖాళీ చేసి దాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సభ్యులకు అప్పగించాలని తెలుగుదేశం పార్టీకి ఒక లేఖ కూడా రాశారు. దీంతో ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ తన కార్యాలయాన్ని 5వ నెంబర్ గది నుండి 118వ నెంబర్ గదికి తాజాగా తరలించడంతో త్వరలోనే ఆ 5వ నెంబర్ గదిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేం దుకు ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ గది కోసం, వైసీపీ ఎందుకు ఇంత మోజు పడుతుంది, ఎందుకు ఇంత పట్టుబడుతుందో ఎవరికీ అర్ధం కావటం లేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read