మండలి రద్దు, మూడు రాజధానులపై రాష్ట్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో లాబీయింగ్ కు తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది. రాష్ట్ర శాసనమండలి రద్దును పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ఆమోదించాలని వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ఇటీవల ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్లను కోరిన నేపథ్యంలో కేంద్రం సానుకూలంగా స్పందించిందని ఎస్సార్ కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. దీంతో వాస్తవ పరిస్థితులను ఢిల్లీ పెద్దలకు వివరించడం ద్వారా ప్రభుత్వ నిర్ణయానికి చెక్ పెట్టేందుకు టీడీపీ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ ఎమ్మెల్సీలు మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు అక్కడే మకాంవేసి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇంకా పలువు కేంద్ర మంత్రులను కలిసి వివరించాలని నిర్ణయించారు. ఎమ్మెల్సీల ఢిల్లీ పర్యటనపై పార్టీ అధినేత చంద్రబాబునాయుడు.. సీనియర్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు.

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సారథ్యంలో మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో, ఎమ్మెల్సీలు పరుచూరి అశోక్బబు, బుద్దా వెంకన్న, సత్యనారాయణరాజు, రామ్మోహన్, దీపక్ రెడ్డి బృందం ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతోంది. ఎన్డీఏ నుంచి వైదొలగిన నేపథ్యంలో బీజేపీకి టీడీపీ రాజకీయ ప్రత్యర్ధిగా మారింది. ఈ పరిస్థితుల్లో ప్రధాని, కేంద్రమంత్రులు అపాయింట్ మెంట్లపై సందేహాలు వ్యకమవుతున్నాయి. అయితే పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ అగ్ర నేతలతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. వైసీపీ, టీడీపీ తమకు ప్రధాన శత్రువులని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నా ఇటీవల వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన అనంతరం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో వైసీపీ భాగ స్వామి అవుతుందనే ప్రచారం జరుగుతోంది. దీన్ని బీజేపీ నేతలు కొట్టి పారేస్తున్నా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జగన్ల మధ్య జరిగిన ఆంతరంగిక చర్చల పర్యవ సానం ఏమిటనేది ప్రతిపక్ష పార్టీలకు అంతుచిక్క టంలేదు.

కాగా మూడు రాజధానులను వ్యతిరే కిస్తూ అమరావతిలో రైతులు పెద్దఎత్తున ఆందోళన చేయటంతో పాటు ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను కలిసి ఫిర్యాదు చేశారు. ఇక మండలి రద్దుపై కూడా కేంద్రానికి ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణ యించింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందినప్పటికీ శాసనమండలిలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉన్నం దున మండలి సెలక్ట్ కమిటీకి అప్పగిస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారని, దీంతో మండలినే రద్దుచేస్తూ శాసనసభలో అధికార పార్టీ ఏకపక్షంగా తీర్మానం చేసిందనే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లా లని టీడీపీ భావిస్తోంది. చైర్మన్ బిల్లుల్ని సెలక్ట్ కమి టీకి పంపిన నేపథ్యంలో మండలి రద్దు చేయటం రాజ్యాంగ విరుద్ధమనే వాదనను కేంద్ర పెద్దలకు వినిపించాలని టీడీపీ ఎమ్మెల్సీలు నిర్ణయించారు. మండలి రద్దు, మూడు రాజధానుల నిర్ణయంతో పాటు ప్రతి పక్షాలపై ప్రభుత్వ వేధింపులు, ప్రజా వ్యతిరేక చర్య లపై కూడా ప్రస్తావించాలని నిర్ణయించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read