ఎన్నికల కమీషనర్, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వార్ లో, ఉద్యోగ సంఘాలు నేతలు కూడా, తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. రాజకీయ నాయకులు కంటే ఎక్కువగా మాట్లాడుతున్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్ష్యుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, ఎన్నికలకు మేము ఒప్పుకోం అని, మాకు ప్రాణహాని ఉందని, మా ప్రాణాలకు ముప్పు వస్తే, ఎదుటి వాడి ప్రాణం తీసే హక్కు రాజ్యాంగం ఇచ్చింది అంటూ, సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే ఈ వ్యాఖ్యల పై , తెలుగుదేశం స్పందించింది. ఎవరిని చంపుతారు నిమ్మగడ్డ గారినా ? హైకోర్టు జస్టిస్‌లనా ? సుప్రీం కోర్టు జస్టిస్‌లనా ? అంటూ కౌంటర్ ఇచ్చింది. అధికారులు కూడా ప్రజాసేవకులుగానే వ్యవహరించాలని, కానీ ఏపీలో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి స్పష్టంచేశారు. శనివారం ఆయన తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. "రాష్ట్రంలో పాలకులు, ప్రజలకు సేవచేయాల్సిన అధికారులు పౌరుల తలలపైకెక్కి ఆడుతున్నారు. ప్రజలకుఇబ్బంది లేకుండా పనిచే యాల్సిన అధికారులు, వారితోసక్రమంగా పనిచేయించాల్సిన పాలకులు సక్రమంగా లేకపోవడాన్ని ఈరాష్ట్రంలోనే చూస్తున్నాం."

kakrla 23012021 2

"ప్రభుత్వంలోని అధికారులు, వ్యవస్థలను ధిక్కరిస్తూ, ఎన్నికలకమిషనర్ పై ధిక్కార స్వరం వినిపిస్తున్నా, వారిపై ఎస్ఈసీ ఎలాంటి చర్యలు తీసుకున్నదాఖలాలు లేవు. అధికారులు ఇప్పటికైనా తమవైఖరి మార్చుకోకుంటే, భవిష్యత్ లో వారు అనేక ఇబ్బందులు పడటంఖాయమని చెబుతున్నాను. భారత రాజ్యాంగంపై ప్రమాణంచేసి, ప్రజలసొమ్మునే జీతాలుగా తీసుకుంటున్నవారు, ప్రజలపక్షాన నిలవకుండా పాలకుల పక్షాన నిలుస్తామనడం ఏమిటి? దానిపై ఉద్యోగులంతా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నాను. మొదటిదశ వ్యాక్సినేషన్ ప్రక్రియ నూటికి 0.6శాతం మాత్రమే జరుగుతోంది. 5న్నరకోట్ల జనాభాలో 3లక్షల70వేలమందికి వ్యాక్సినేషన్ వేస్తే, దాన్ని అడ్డుగా ఎలా చెబుతారు? వ్యాక్సిన్ తీసుకున్నవారంతా విధులునిర్వర్తించలేరా? అనేకరాష్ట్రాల్లో ఎన్నికలుజరపాలని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చినా కూడా, వాటిని పట్టించుకోకుండా, ప్రజలసొమ్ము వృథాచేయడమే లక్ష్యంగా కోర్టులుచుట్టూ తిరుగుతున్నారు. ప్రజలహక్కైన ఓటు ప్రభుత్వాల చేతిలోకి వెళితే, అది నాశనానికే దారితీస్తుంది. " అని దీపక్ రెడ్డి అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read