నారా చంద్రబాబు నాయుడు అంటే, ఈ దేశంలోనే తెలియని వారు ఉండరు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 10 ఏళ్ళకు పైగా ప్రతిపక్ష నేతగా, దేశంలో కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటులో కీలక వ్యక్తిగా, రాష్ట్రపతులను నియమించిన కీలక వ్యక్తిగా, ఇలా అనేక విధాలుగా చంద్రబాబు అంటే దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. గతంలో నక్సల్స్ పై, అలాగే ఎర్ర చందనం మాఫియా పై, ఆయన చేసిన పోరాటానికి ఫలితంగా, ఆయన పై నక్సల్స్ దాడి జరగటం, చెయ్యి ఫ్రాక్చర్ అవ్వటం, ఇవన్నీ అందరికీ తెలుసు. అప్పటి నుంచి చంద్రబాబుకు జెడ్ ప్లస్ క్యాటగరీ బద్రత కలిపిస్తుంది కేంద్రం ప్రభుత్వం. కేంద్రంలో పార్టీలు మారినా, కాంగ్రెస్ వచ్చినా, బీజేపీ వచ్చినా, అయానతో రాజకీయ వైరం ఉన్నా సరే, ఈ బద్రత కొనసాగుతూనే ఉంది. మొన్నటి మొన్న బీజేపీతో అంత పోరాటం చేసినా, మొన్న చేసిన బద్రతా రివ్యూలో, చాలా మందికి జెడ్ ప్లస్ తీసారు కాని, చంద్రబాబుకు మాత్రం కేంద్రం జెడ్ ప్లస్ బద్రత తియ్యలేదు అంటూ, చంద్రబాబుకు బద్రత ఎంతటి కీలక విషయం అనేది ఇక్కడ అర్ధం అవుతుంది.

అయితే ఇంతటి కీలక విషయంలో, ఇక్కడ వైసీపీ ప్రభుత్వం చూపిస్తున్న అశ్రద్ద పై, తెలుగుదేశం పార్టీ మండి పడుతుంది. వారం రోజుల క్రితం రాష్ట్ర ఇంటలిజెన్స్ ఐజి నుంచి చంద్రబాబు పర్సనల్ సెక్రటరీకి ఒక లేఖ వచ్చింది. ఆ లేఖ ప్రకారం, చంద్రబాబు బద్రతను, 58కి తగ్గించినట్టు ఉంది. గతంలో చంద్రబాబుకి జెడ్ ప్లస్ సెక్యూరిటీలో భాగంగా, 160 మంది సిబ్బంది బద్రతగా ఉండే వారు. అయితే, ఇప్పుడు తాజగా నిఘా ఐజి పంపించిన లేఖలో, 58కి తగ్గించినట్టు ఉంది. రాష్ట్రంలోని ప్రముఖులకు కల్పిస్తున్న భద్రతను సమీక్షించామని, ఎల్లోబుక్‌ను అనుసరించి చంద్రబాబు రక్షణ సిబ్బంది సంఖ్యను 58కి పెట్టినట్టు ఆ లేఖలో రాసారు. అయితే, దీని పై తెలుగుదేశం పార్టీ మండి పడింది.

అయితే గతంలో జగన్ ప్రభుత్వం రాగానే, ఇలాగే చెయ్యటంతో, చంద్రబాబు హైకోర్ట్ కు వెళ్లి, అదే బద్రత తెచ్చుకున్నారు. అయితే, ఇప్పుడు మళ్ళీ తగ్గించటం పై టిడిపి భగ్గు మంటుంది. చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర పేరుతొ, ప్రజల్లోకి వెళ్తున్నారని, ఇప్పుడు జరగరానిది ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించింది. అయితే దీని పై, పెద్ద రచ్చ అవ్వటంతో, డీజీపీ కార్యాలయం స్పందించింది. చంద్రబాబుకి ఎలాంటి బద్రత తగ్గించలేదని, 183 మందితో భద్రత కల్పిస్తున్నట్లు డీజీపీ కార్యాలయం పేర్కొంది. ఇక్కడ 135 మంది, హైదరాబాద్ లో 48 మందితో బద్రత ఇస్తున్నట్టు చెప్పింది. అయితే టిడిపి మాత్రం, ఇది తప్పుడు సమాచారం అని, కేవలం 58 మంది అని వాళ్ళ ఇంటలిజెన్స్ లేఖ ఉంటే, డీజీపీ కార్యాలయం మాత్రం తప్పుడు సమాచారం ఇచ్చింది అంటూ టిడిపి అంటుంది. ఏది ఎలా ఉన్నా, ఇలా ఒక ప్రముఖ వ్యక్తి బద్రత పై, ఇంటలిజెన్స్ ఒక మాట, డీజీపీ కార్యాలయం మరో మాట చెప్పటం పై, టిడిపి ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read