స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అధికార పార్టీ వేస్తున్న పిల్లి మొగ్గలు, ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే భయమో, లేక ఎన్నికలు అంటే భయమో కానీ, మొన్నటి దాక ఒక మాట, ఇప్పుడు ఒక మాట మాట్లాడుతూ, మాట మార్చి, మడం తిప్పేస్తున్నారు అంటూ, తెలుగుదేశం పార్టీ, మాట మార్చిన తెలుగుదేశం పార్టీ నేతల లిస్టు విడుదల చేసింది. గతంలో వాళ్ళు మాట్లాడిన మాటలు, ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు లిస్టుని విడుదల చేసారు. జగన్ మోహన్ రెడ్డి (నాడు) :క-రో-నా ప్రాణాంతకం కాదు. (15.03.2020) క-రో-నాకు పారాసిటమల్, బ్లీచింగ్ పౌడర్ చాలు. స్థానిక సంస్థల ద్వారానే క-రో-నా నియంత్రణ సాధ్యం (15.03.2020) ముఖ్యమంత్రి నేనా? నువ్వా? ఆదేశాలన్నీ ఆయనే ఇస్తే నేనెందుకు? క-రో-నా వైరస్ ఓ సాకు. చంద్రబాబు సామాజిక వర్గం కాబట్టే ఎన్నికలు వాయిదా వేశారు. వైకాపా ఘన విజయమని తెలిసే వాయిదా వేశారు. క-రో-నా ఎక్కడుందని (16.03.2020). జగన్ మోహన్ రెడ్డి (నేడు) : ప్రతిపక్ష నాయకుడు, ఆయన కుమారుడు క-రో-నా కు భయపడి హైదరాబాద్ లో వాళ్ల ఇంట్లోనే దాక్కుంటే, ఆయన కోవర్టులు మాత్రం సామన్య ప్రజలు బతికితే ఎంత, చస్తే ఎంత అని ఎన్నికలకు నోటిఫికేషన్లు ఇస్తున్నారు. (11.01.2021). విజయసాయిరెడ్డి (నాడు) : క-రో-నా వైరస్ కన్నా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్.ఈ.సి) రమేష్ కుమార్ అంత్యంత ప్రమాదకారి. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా వచ్చిందని ఎన్నికలు వాయిదా వేయటం హేయమైన చర్య (15.03.2020). విజయసాయిరెడ్డి (నేడు) : స్థానిక ఎన్నికలు ప్రభుత్వం అనుకున్న విధంగానే న్యాయపరమైన చిక్కులు తొలగిన తర్వాతనే నిర్వహిస్తాం. 19.12.2020. బొత్స సత్యనారాయణ(నాడు) : ఎన్నికలు ఆపడం నిబంధనలకు విరుద్ధం. జగన్ మహానాయకుడు. విచక్షణారహితంగా ఎన్నికల నిర్వహణను వాయిదా వేశారు. (16.03.2020). బొత్స సత్యనారాయణ (నేడు) : ఎస్.ఈ.సి. రమేష్ కుమార్ ఎన్నికలకు ఎందుకు ఆత్రుత పడుతున్నారో అర్ధం కావడం లేదు. ఎస్.ఈ.సి తీరు రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీసేలా ఉంది.

jagan 16012021 2

అంబటి రాంబాబు (నాడు) : రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా పడింది క-రో-నా వైరస్ వల్ల కాదు. క్యాస్టు వైరస్ వల్లే. క-రో-నా 2 వ దశలోకి వెళ్లేలోపు ఎన్నికలు నిర్వహించాలి. (16.03.2020). అంబటి రాంబాబు (నేడు) : ఎవరి మేలు కోసం ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. మొండిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం ప్రజాస్వామ్యంలో అన్యాయమైన ప్రక్రియ. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (నాడు) : ఎన్నికలు నిర్వహించాలి. సచివాలయం వ్యవస్థ ద్వారా క-రో-నాను నియంత్రించవచ్చు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (నేడు) : ఒక వ్యక్తి మెప్పుకోసం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి తన ఆధిక్యతను చూపేందుకు ఇచ్చిన ఈ నోటిఫికేషన్ తో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం జరగదు. పేర్ని నాని (నాడు) : ఎన్నికల సంఘానికి బాబు వైరస్. కుట్రలో భాగమే స్థానిక ఎన్నికల వాయిదా. పేర్ని నాని (నేడు): టీకా ప్రక్రియ పూర్తయితేనే ఎన్నికలు. ఎన్నికలు వాయిదా వేయడానికి అవసరమైన అన్ని మార్గాలు ఎంచుకుంటాం. ఎస్.ఈ.సి వ్యవహార శైలి ప్రజాస్వామ్య చరిత్రలో దుర్మార్గమైన చర్య. ఆదిమూలపు సురేష్ (నాడు) : క-రో-నా సాకుతో స్థానిక ఎన్నికలు వాయిదా వేశారు. దీనిపై పున:సమీక్షించాలి. ఆదిమూలపు సురేష్ (నేడు): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మఒడి కార్యక్రమం యదావిధిగా జరుగుతుంది. అనిల్ కుమార్ యాదవ్ (నాడు) : క-రో-నా సాకుతో ఎన్నికల నిలుపుదల పెద్ద కుట్ర. అనిల్ కుమార్ యాదవ్ (నేడు) : ఎన్నికల పేరుతో సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారు. కొడాలి నాని (నాడు) : రమేష్ కుమార్ బొచ్చు కూడా పీకలేడు. (13.04.2020). కొడాలి నాని (నేడు) : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను హైకోర్టు రద్దు చేసింది. నైతిక భాద్యత వహిస్తూ రమేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read