రాష్ట్రహైకోర్టు ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ ని తిరస్కరించి, ప్రజారోగ్యమే ముఖ్యమని చెప్పడం జరిగిందని, దాన్ని తాము తప్పుపట్టడంలేదని, కానీ అదేదో అధికారపార్టీ సాధించిన పెద్ద విజయంగా వైసీపీనేతలు భావించడాన్నే తాము తప్పుపడు తున్నామని టీడీపీఎమ్మెల్సీ అశోక్ బాబు స్పష్టంచేశారు. సోమవారం సాయంత్రం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో ప్రభుత్వం తీసుకున్న అనేక ప్రజావ్యతిరేక నిర్ణయాలను హైకోర్టు తప్పుపట్టడం జరిగిందన్న ఆయన, ఆనాడు తేలుకుట్టిన దొంగల్లా కిమ్మనకుండా ఉన్న వైసీపీనేతలు, ఇప్పుడేదో పెద్ధ ఘనకార్యం సాధించినట్లు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపట్టిందన్న అక్కసుతో ,హైకోర్టు న్యాయమూర్తు లను కూడా దూషించారని, ముఖ్యమంత్రి అయితే ఏకంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ నే తప్పుపడుతూ సుప్రీంకోర్టుకే లేఖరాశాడన్నారు. కోర్టుల నిర్ణయాలు పక్కనపెడితే, ప్రభుత్వం నిజంగా ఎన్నికలకు వెళ్లడానికి ఎందుకు భయపడుతోందో చెప్పాలన్నారు. కోవిడ్ అనేదే ఉంటే ముఖ్యమంత్రి నేడు నెల్లూరులో వేలాదిమందితో బహిరంగ సభ ఎలా నిర్వహించాడో చెప్పాలని టీడీపీ ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు. ద్యందుకాణాలు తెరిచినప్పుడు, పాఠశాలలు ప్రారంభిం చినప్పుడు, ప్రభుత్వకార్యక్రమాల పేరుతో అధికారపార్టీవారు సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించినప్పుడు లేని కరోనా ఎన్నికల నిర్వహణకు వచ్చేసరికి పాలకులకు ఎందుకు గుర్తుకొస్తుందో చెప్పాలన్నారు. అన్నివ్యవస్థలు రాష్ట్రంలో యథావిథి గా పనిచేస్తున్నప్పుడు వైరస్ ప్రభావం ఎక్కడుందో చెప్పాలన్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ అనేదికూడా ఫ్రంట్ లైన్ వారియర్లకే ముందు ఇస్తామని కేంద్రం స్పష్టంచేసినందున, ఎన్నికల సిబ్బందికి ఉన్న అభ్యంతరమేమిటని అశోక్ బాబు ప్రశ్నించారు. స్థానిక ఎన్నికలు వాయిదావేయమని కోరిన ప్రభుత్వం, తిరుపతి ఉప ఎన్నికను వాయిదా వేయమని ఎందుకు కోరడం లేదన్నారు. గతంలో స్థానికఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పుడు, రెండు నెలలవరకు రాష్ట్రంలో కరోనాఅనేది రాదని చీఫ్ సెక్రటరీతో ఎన్నికల సంఘానికి లేఖరాయించిన ప్రభుత్వం, మార్చిలోఎన్నికలు నిర్వహించవచ్చనే హామీని ఏమైనా ఇవ్వగలదా అన్నారు.

ఈ ప్రభుత్వానికి ఎన్నికల్లో గెలుస్తామనే ఆలోచన ఉంటే, ఎందుకు ఎన్నికలు వాయిదా వేయిస్తుందో చెప్పాలన్నారు. ఎన్నికల కమిషనర్ గా రమేశ్ కుమార్ ఉంటే తమ దౌర్జన్యాలు, బెదిరింపులు, రిగ్గింగులు, ప్రలోభాలు పెట్టడం సాగవని తెలిసే ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు వెళ్లడంలేదని అశోక్ బాబు స్పష్టంచేశారు. రమేశ్ కుమార్ ఎస్ఈసీగా లేకుంటే ఎన్నికల్లో ఇష్టమొచ్చినట్లు చేసుకోవచ్చన్నఆలోచన ప్రభుత్వానికిఉందని, అధికారపార్టీ నేతలు, మంత్రుల మాటల్లోనే అర్థమవుతోందన్నారు. పార్టీ గుర్తుపై స్థానికఎన్నికలు జరగనప్పుడు ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందిఏమిటన్నారు. వ్యాక్సిన్ పంపిణీ జరిగే సమయంలో నే తిరుపతిఉప ఎన్నిక జరిగితే, అప్పుడు ప్రభుత్వం ఆ ఎన్నిక నిర్వహించవద్దని కోర్టునుఆశ్రయించగలదా అని అశోక్ బాబు ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో అధికారపార్టీ జెండా ఎగరదన్న ఒకేఒక్క కారణంతోనే ప్రభుత్వం, హడావుడిగా ఇళ్లపట్టాలు, అమ్మ ఒడి పేరుతో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలను నిర్వహిస్తోంద న్నారు. ఎన్నికలకోడ్ పల్లెలకు వర్తించదని తెలిసినప్పుడు, పథకాల అమలుకు వచ్చిన ఇబ్బంది కూడా ఏమీ ఉండదన్నారు. ఎన్నికలకమిషనర్ రాజీనామా చేయాలంటున్న ప్రభుత్వం, మంత్రులు, గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన అనేక తీర్పులపై ఎందరురాజీనామాలు చేశారో చెప్పాలన్నారు. ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పే అంతిమతీర్పు కాదనే నిర్ణయాన్ని ప్రభుత్వం గుర్తంచుకుంటే మంచిదన్నారు. హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టి, ఎన్నికలు పెట్టాల్సిందే నని చెబితే అప్పుడు వైసీపీప్రభుత్వం ఏంచేస్తుందో చెప్పాలన్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో ఎప్పుడుఎన్నికలు జరిగినాకూడా టీడీపీకి వచ్చిన ఇభ్బందేమీ లేదన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read