అవినీతి నిరోధానికి ప్రజల్లో మరింత చైతన్య స్పూర్తిని రగిలించేందుకు గాను జగన్ ప్రభుత్వం బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధుని రంగం లోకి దించింది. అవినీతి నిరోధానికి గాను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్,14400 నెంబర్ పై సింధుతో పాటుగా జగన్ సందేశం ఇచ్చారు. ఎవరు అవినీతికి పాల్పడినా నిర్భయంగా మీ గొంతు విన్పించండి అంటూ సింధు సందేశంతో కూడిన వీడియోను ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన కార్యాలయంలో విడుదల చేశారు. జగన్ అవినీతి రహిత సమాజం కోసం కృషి చేస్తున్నారని కూడా సింధు తన సందేశంలో పేర్కొన్నారు. ఈ వీడియోతో పాటు జగన్ సందేశంతో కూడిన ప్రచార వీడియోను కూడా ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ అన్ని స్థాయిల్లో అవినీతిని రూపుమాపాలని, అవినీతిని అంతం చేసేందుకు అధికారులు దృష్టి సారించాలని కోరారు. అవినీతి నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, టోల్ ఫ్రీ నెంబర్‌కు సమాచారం ఇచ్చి ప్రజలకు సహకరించాలని జగన్ కోరారు.

video 26022020 2

తన ప్రభుత్వంలో అవినీతి అనే మాటే వినపడకూడదని, తన ప్రభుత్వం వచ్చిన తరువాత అవినీతి లేకుండా చేసామని అన్నారు. అయితే, ఆ వీడియో పై, తెలుగుదేశం పార్టీ సటైర్ల వర్షం కురిపిస్తుంది. జగన్ అవినీతి పై యుద్ధం అంటే, దెయ్యాలు వేదాలు చెప్పినట్టు ఉంది అంటూ, టిడిపి నేతలు వాపోయారు. 11 సిబిఐ కేసుల్లో, 5 ఈడీ కేసుల్లో ఏ1 గా ఉంటూ, 43 వేల కోట్ల అవినీతి చేసారని, సిబిఐ చెప్పటంతో, ఇప్పటికే 16 నెలలు జైలులో ఉండి, కండీషనల్ బెయిల్ పై బయట తిరుగుతూ, చివరకు దేశం దాటి వెళ్ళాలి అన్నా కోర్ట్ పర్మిషన్ తీసుకుని వెళ్ళే జగన్, ప్రతి శుక్రవారం అవినీతి కేసుల్లో కోర్ట్ కు వెళ్తున్నారని, ముందుగా తాను అవినీతి చెయ్యలేదు అని నిరూపించుకున్న తరువాతే, ఇలాంటి ప్రకటనలు ఇవ్వాలి అంటూ టిడిపి వాపోయింది.

రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యం ఏలుతుంటే, జగన్ మాత్రం అవినీతి తగ్గిందని చెప్తున్నారని, తన ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, జేటాక్స్ పేరుతొ వసూలు చేస్తున్న డబ్బులు అన్నీ ఎవరి దగ్గరకు వెళ్తున్నాయని ప్రశ్నిస్తున్నారు ? రాష్ట్రంలో ఇసుక మాఫియా ఎలా ఉందొ జగన్ కు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో 1500 కు దొరికే ఇసుక, ఈ రోజు 6 వేలు చెప్తుంటే, ఆ డబ్బులు అన్నీ ఎవరు తింటున్నారని ప్రశ్నిస్తున్నారు. వైన్ మాఫియా, సాండ్ మాఫియా, మైన్ మాఫియా, ల్యాండ్ మాఫియా ఇలా అన్ని మాఫియాలు జగన్ ప్రభుత్వంలో ఉన్నాయని, జే టాక్స్ పేరుతొ , ప్రతి వ్యాపారంలో వాటాలు తీసుకుంటూ, వీళ్ళా అవినీతి గురించి మాట్లదేదని టిడిపి ప్రశ్నిస్తుంది. ముందుగా జగన్ తన అవినీతి కేసుల నుంచి బయట పడితే, అప్పుడు ఇలాంటి ప్రచారాలు చేసుకోవచ్చని టిడిపి ఆరోపిస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read