మూడురాజధానులనిచెప్పి, విశాఖలోని ఖరీదైన భూములనుకబ్జాచేస్తున్న జగన్ ప్రభుత్వం, రూ1450కోట్లకు ఎన్ బీసీసీకి అప్పగిస్తూ జీవో ఇచ్చిందని, ఎవడబ్బ సొమ్మని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వభూములు అమ్ముతున్నాడని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి మండిపడ్డారు. బుధవారం ఆయన తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం... గతంలో జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి కాపులుప్పాడలోని భూములనుఅమ్మి , పులివెందులను, ఇడుపులపాయ ను అభివృద్ధిచేసుకున్నాడు. ఆ భూములు కేంద్రం జరిమానా విధిస్తే, విశాఖప్రజలు కట్టాల్సివచ్చింది. ఆనాడు విశాఖవాసులకు వై.ఎస్. ఆవిధంగా ఉపకా రంచేస్తే, ఇప్పుడుజగన్మోహన్ రెడ్డి విశాఖభవిష్యత్ ను నాశనంచేసేలా ఇక్కడున్న భూములు అమ్మకానికి పెట్టాడు. విశాఖనగరంలోని భూములుఅమ్మేస్తే, రేపు ఏవైనాపరిశ్రమలు, ఫ్యాక్టరీలు వస్తే, వాటిని ఎక్కడపెట్టా లి. దీనిగురించి ముఖ్యమంత్రి ఆలోచించడా? టీడీపీ ప్ర భుత్వం తీసుకొచ్చిన లులూ గ్రూపునువిశాఖ నుంచి తరమేశారు. అదే పరిశ్రమ ఉండుంటే, విశాఖమరింత బాగా అభివృద్ధిచెంది, మాప్రాంతంలోని యువతకు ఉపా ధి, ఉద్యోగాలు లభించేవి. పర్యాటకరంగం విపరీతంగా అభివృద్ధిచెంది ఉండేది. విశాఖపై జగన్ కు అసలుప్రేమ ఉందా? ఉక్కునగరం అభివృద్ధిచెందడం జగన్ కు ఇష్టం లేదా? విశాఖలోని భూములను గతప్రభుత్వం లులూ గ్రూపుకు అప్పగిస్తే, అది జగన్ కు నచ్చకపోతే దాన్ని తలదన్నేపరిశ్రమ తీసుకురావాలి. అలా తీసుకొచ్చిన పరిశ్రమలకు భూములివ్వాలి. అదిచేయకుండా ఉన్న భూములను అమ్మేస్తే, భవిష్యత్ లో అవసరాలకు ఎక్క డినుంచి వస్తాయి? విశాఖవాసులను ప్రలోభపెడుతూ, దుర్మార్గంగా విలువైన భూముల్ని అమ్ముతారా?

గతం లోకూడా గాజువాకలోని భూముల్ని అమ్మబోతే, విశాఖ వాసులు వాటిని కాపాడుకోవడానికి కోర్టుకెళ్లి స్టే తెచ్చు కున్నారు. అయినాకూడా సిగ్గులేకుండా మరలా భూ ములమ్మడానికి ముందుకొస్తారా? ప్రభుత్వ భూముల అమ్మకంపై తాము తిరిగి కోర్టునుఆశ్రయిస్తాం. బీచ్ ప్రాం తంలోని భూములను అభివృద్ధిచేస్తే, విశాఖ అభివృద్ధి చెందుతుంది. దానివల్ల ప్రజల ఆదాయం పెరుగుతుంది. వారికి ఉపాధి,ఉద్యోగాలు లభిస్తాయి. జగన్మోహన్ రెడ్డికి అంతలా భూములు అమ్ముకోవాలని ఉంటే, ఇడుపుల పాయలో తాను ఆక్రమించుకున్న ప్రభుత్వభూముల్ని అమ్మాలి. అసైన్డ్ భూములుకూడా ఆయనకింద ఉన్నా యికదా అవి అమ్మొచ్చుగా? తనప్రాంతంలోని భూము ల్ని ,పారిశ్రామికవేత్తల ముసుగులో తన అనుమాయు లకుకట్టబెడుతూ, సాగరనగరంలోనిభూములను అమ్మ కానికిపెట్టడం ముమ్మాటికీ దుర్మార్గమే. ముఖ్యమంత్రికి విశాఖప్రజలపై, మహానగరంపై ప్రేమ లేదు. అక్కడిప్రజ లు గతఎన్నికల్లో వైసీపీకి ఓటేయలేదని జగన్ కు కడు పుమంట. మొన్నజరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ గెలిచినందుకు, భూములఅమ్మకంద్వారా ఆప్రాంత వాసుల కు ఈవిధంగా గిఫ్ట్ ఇస్తారా? విశాఖలోని భూ ములమ్మి రాష్ట్రంలోని ప్రజలకు పప్పుబెల్లాలుపంచుతా ననడేమిటి? నిజంగా జగన్ కు చిత్తశుద్ధిఉంటే, విశాఖ నగరాన్ని ఎందుకు అభివృద్ధిచేయలేదు? చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన పథకాలనుకూడా పూర్తిచేయ లేదు. ఆయన విశాఖకుతీసుకొచ్చిన సంస్థలు, పరిశ్రమ లనుకూడా ఈ ముఖ్యమంత్రి వెళ్లగొట్టాడు. పులివెందుల కు వేలకోట్లు కేటాయిస్తూ, విశాఖవంటి మహానగరాల ను గాలికొదిలేస్తారా? తానుపంచే పప్పుబెల్లాలకు ముఖ్యమంత్రికి డబ్బులు కావాలిగానీ, విశాఖ నగరాభి వృద్ధితో ఆయనకుపనిలేదు. విశాఖనగరంలోని భూము లు అమ్ముతామంటే చూస్తూ ఊరుకోం. అవసరమైతే సుప్రీంకోర్టుకువెళ్లయినా సరే, మా భూములను మేం కాపాడుకుంటాం. విశాఖ భూములఅమ్మకంపై అన్ని పార్టీలతో చర్చించి ఉద్యమంచేసేదిశగా కార్యాచరణ ప్రకటిస్తాము. విశాఖలోని భూములను అమ్మొద్దని జగ న్మోహన్ రెడ్డిని తీవ్రంగా హెచ్చరిస్తున్నాను.

Advertisements

Advertisements

Latest Articles

Most Read