ఉదయం నుంచి తెలుగుదేశం పార్టీ 13 జిల్లాల క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు రాజీనామా చేసారు అంటూ, బులుగు మీడియా చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ తిప్పి కొట్టింది. తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిని నేనే అంటూ, యలమంచలి ప్రవీణ్ అనే వ్యక్తి ఉదయం నుంచి టీవీల్లో చేస్తున్న హడావిడి పై స్పందిస్తూ, ప్రవీణ్ అనే వ్యక్తి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు , మద్దిరాల మ్యానీ ప్రకటన విడుదల చేసారు. ప్రవీణ్ అనే వ్యక్తికి అసలు పార్టీతో సంబంధమే లేదని, పరోక్షంగా కూడా పార్టీకి అతనికి లింక్ లేదని తేల్చి చెప్పారు. అసలు ప్రవీణ్ అనే వ్యక్తికీ సభ్యత్వం కూడా లేదని అన్నారు. దీని వెనుక వైసీపీ పార్టీ కుట్ర ఉందని, కావాలని ఇలా చేస్తున్నారని అన్నారు. మరోసారి ప్రవీణ్ ఇలా ప్రచారం చేసినా, టిడిపి ఫోటోలు వాడినా, అతని పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక పోతే, అసలు చంద్రబాబు ఎక్కడా క్రీస్టియన్ లను ఒక్క మాట అనలేదని, జగన్ మోహన్ రెడ్డి వైఖరిని మాత్రమే ప్రశ్నించారని గుర్తు చేసారు. ప్రవీణ్ అనే వ్యక్తి జూపూడికి దగ్గర వారని, జూపూడితో పాటే అతను వెళ్లిపోయాడని తెలుగుదేశం నేతలు అంటున్నారు. అతనికి పార్టీకి సంబంధం లేదని, ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని కోరారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read