మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులు ఇక సెలెక్ట్ కమిటీకి వెళ్లనట్లేనా.. అంటే అవుననే రాజకీయ వర్గాలు, అధికార పార్టీ వైసీపీ నేతలు, అసెంబ్లీ అధికారులు చెప్తున్నారు. గతనెల ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో మండలి చైర్మన్ తన విచక్షణాధికారాలతో ఆ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి వంపాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. దీనిని అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కారణంతో ఏకంగా శాసనమండలినే రద్దు చేసింది. చైర్మన్ కమిటీలు ఏర్పాటుకు పార్టీల నుంచి పేర్లు కోరడం, రెండు బిల్లుల కోసం రెండు కమిటీల్లో పేర్లను సైతం ప్రతిపాదించారు. అయితే కమిటీలకు చైర్మన్లుగా వ్యవహరిం చాల్సిన మంత్రులు మాత్రం ససేమిరా అన్నారు. బిల్లులు మండలికి వచ్చి 14 రోజులు పూర్తవ్వడంతో బిల్లులు ఆమోదం పొందినట్టేనంటూ మంత్రులు వాదించారు. టీడీపీ మాత్రం అవి మనీ బిల్లులు కావని దీంతో అవి సభ ఆమోదించినట్లు కాదని స్పష్టం చేస్తున్నారు. చైర్మన్ ఆ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలంటూ రెండు సార్లు రాసిన లేఖలను తిరస్కరిస్తూ అసెంబ్లీ కార్య దర్శి లేఖలు రాయడంతో కథ అడ్డం తిరిగింది.

దీనిపై న్యాయపోరాటం చేయాలని టీడీపీ భావిస్తుండగా, వేచిచూసే ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. చైర్మన్ ఆదేశించినా.. కార్యదర్శి ససేమిరా.. ఇప్పటికే రెండుసార్లు మండలి చైర్మన్ కమిటీలు ఏర్పాటు చేయాలంటే శాసనసభ కార్యదర్శికి లేఖలు రాశారు. సెలెక్ట్ కమిటీకి వంపడం సాధ్యం కాదంటూ కార్యదర్శి తిరిగి చైర్మన్‌కు లేఖ ద్వారా సమాధానమిచ్చారు. కార్యదర్శిపైన ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి చైర్మన్ ఆదేశాలు అమలు కాకుండా అడ్డుకుంటుందని టీడీపీ ఆరోపిస్తోంది. చైర్మన్ ఆదేశాలు కార్యదర్శి అమలు చేయకుంటే ఉల్లంఘన కింద చర్యలకు అవకాశముందని చెవున్నారు. ఇదే సమయంలో సెలెక్ట్ కమిటీ విషయంలో వేచి చూసే ధోరణిలో. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నట్లుగా కనిపిస్తుంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపే అవకాశమే లేదంటున్న అధికార పార్టీ బడ్జెట్ సమావేశాల వరకు ఎదురు చూసే అవకాశం కనిపిస్తోంది. నిబంధనల ప్రకారం వ్యవహరిస్తు న్నారంటూ మండలి కార్యదర్శికి వైఎస్సార్సీ అండగా నిలుస్తుంది. ఇదే సమయంలో ప్రతివక్ష వ్యూహాలకు విరుగుడు కనిపెట్టే దిశగా కసరత్తు కొనసాగుతుంది. ప్రతిపక్షం కోర్టుకెళ్లినా ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 189 క్లాజ్-1 ప్రకారం మండలి సెక్రటరి నిబంధనల మేరకే వ్యవహరించా రంటున్న వైసీపీ, బిల్లులపై ఏం చేయాలనే ఆలోచనలో అభిప్రాయ సేకరణ చేస్తోంది. ఆర్డినెన్స్ చేయలా? గవర్నర్ వద్దకు పంపాలా? అనే అంశంపై నందిగ్ధతతో ఉన్నట్లు కనిపిస్తోంది. టిడిపి మాత్రం, సభా హక్కుల ఉల్లంఘనతో పాటుగా, కేంద్రం వద్దకు, కోర్ట్ కు వెళ్ళాలని భావిస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read