మొన్న కుప్పంలో అధికారం, డబ్బు, పోలీసులు ఇలా మొత్తాన్ని ఉపయోగించుకుని, మెజారిటీ పంచాయతీలు గెలుచుకున్న వైసీపీ, ఈ రోజు నాలుగవ విడత జరిగిన నారావారి పల్లె ఎన్నికల్లో కూడా గెలిచి చంద్రబాబుని దెబ్బ కొట్టాలని భారీ ప్లాన్ వేసారు. కుప్పంలో చేసినట్టు చేయటమే కాక, ఈ సారి దొంగ ఓట్లు కూడా వేసే ప్రయత్నం చేసారు. తిరుపతి నుంచి నారావారి పల్లె వచ్చి, ఓటింగ్ లైన్ లో నుంచున్న దాదాపు 20 మందిని టిడిపి వాళ్ళు పట్టుకుని, పోలీసులకు అప్పగించారు. అయితే మళ్ళీ చంద్రబాబుని టార్గెట్ చేస్తూ, వైసీపీ నేతలు పెద్ద ఆపరేషన్ చేయటంతో, నారా వారి పల్లెలో కూడా ఎలా ఫలితం ఉంటుంది అనే టెన్షన్ ప్రజల్లో నెలకొంది. దొంగ ఓట్లు కూడా వేయటంతో, ఇక ఇది కూడా వైసీపీ కొట్టేస్తుందని అందరూ అనుకున్నారు. అయితే టిడిపి మాత్రం భారీ మెజారిటీతో గెలిచింది. వైసీపీ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, అధికారం ఉపయోగించినా అడ్రెస్ లేకుండా పోయారు. రెండు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. అయితే ఎన్నిక జరిగిన ఎనిమిది వార్డులకు గానూ, ఎనిమిది వార్డులు తెలుగుదేశం పార్టీ గెలిచింది. అలాగే సర్పంచి అభ్యర్ధి కూడా, బొబ్బా లక్ష్మి 563 ఓట్లతో గెలిచారు. దీంతో వైసీపీకి భంగపాటు తప్పలేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read